UK PM Pongal Feast: బ్రిటన్ ప్రధాని కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు
UK PM Rishi Sunak hosted a traditional feast for his staff to celebrate Pongal: బ్రిటన్ ప్రధాని సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. తన కార్యాలయ సిబ్బందికి సంక్రాంతి ప్రత్యేకతను చాటారు. సంప్రదాయ బద్దంగా అరిటాకుల్లో స్వీట్ పొంగల్, భారతీయ వంటకాలతో సంక్రాంతి విందు ఏర్పాటు చేసారు. కార్యాలయ రక్షణ సిబ్బందితో పాటుగా అధికారులు..భారత దౌత్యాధికారులను ఈ వేడుకలకు ఆహ్వానించారు. బ్రిటన్ వ్యవహార శైలికి కొత్తగా కనిపించిన ఈ అతిథ్యాన్ని వారంతా ఆసక్తిగా, సంతోషంగా స్వీకరించారు. వీరికి ఇచ్చిన విందు వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. రక్షణ యూనిఫారం ధరించిన అధికారులతో పాటుగా ప్రధానమంత్రి కార్యాలయ సిబ్బందికి పంచలు ధరించిన సిబ్బంది సక్రాంతి విందును వడ్డించారు.
స్వీట్ పొంగల్ ను స్వీకరిస్తున్న సమయంలో ఆ వంటకం ప్రత్యేకతను వారికి వివరించారు. భారతీయ సంప్రదాయాలకు విలువ ఇచ్చే రిషి సనాక్ బ్రిటన్ ప్రధాని అయిన తరువాత కూడా లండన్ లో వాటిని పాటిస్తున్నారు. కొద్ది నెలల క్రితం వినాయక చవితి వేడుకలను నిర్వహించారు. ఈ వీడియో చూసిన భారతీయులు రిషి సనాక్ ను అభినందిస్తూ పోస్టింగ్ లు చేస్తున్నారు. ప్రతీ ఒక్కిరకీ ప్రధాని రిషి సనాక్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వీడియోనుకు భారతీయుల నుంచి అభినందనలతో కూడిన కామెంట్స్ కనిపిస్తున్నాయి. చేతితో తినటానికి ఇష్టపడని వారు, ఇలా కలిసి కూర్చొని తినటం సంతోషంగా ఉందంటూ కామెంట్స్ పోస్ట్ చేసారు. స్వాగతించాల్సిన మార్పుగా నెటిజెన్ల పేర్కొన్నారు.
Viral Video of UK defense & PM's office staff celebrating Pongal/Makar Sankranti festival.
A welcome change 🇮🇳 pic.twitter.com/CZXAjSxZLy
— Megh Updates 🚨™ (@MeghUpdates) January 17, 2023