చంద్రయాన్-3 విజయాన్ని బ్రిటన్ జీర్ణించుకోలేకపోతోంది. చంద్రయాన్-3 విజయంపై బ్రిటన్ జర్నలిస్టులు అక్కసు వెల్లగక్కుతున్నారు.
UK: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రయోగించిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైన విషయం తెలిసిందే. చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండర్‌ను సేఫ్ ల్యాండింగ్ చేసి భారత్ చరిత్ర సృష్టించింది. చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన మొదటి దేశంగా భారత్ రికార్డుకెక్కింది. ఈక్రమంలో ప్రపంచదేశాలు భారత్‌పై ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి.
కానీ ఈ విజయాన్ని బ్రిటన్ జీర్ణించుకోలేకపోతోంది. చంద్రయాన్-3 విజయంపై బ్రిటన్ జర్నలిస్టులు అక్కసు వెల్లగక్కుతున్నారు. చంద్రుడిపైకి వ్యోమనౌకలను పంపిస్తున్న దేశానికి ఎందుకు సాయం అందివ్వాలని జీబీ న్యూస్ చానెల్‌కు చెందిన ప్యాట్రిక్ క్రిస్టీస్ అనే జర్నలిస్ట్ ప్రశ్నించారు. 2016 నుంచి 2021 మధ్యలో బ్రిటన్.. భారత్‌కు 2.3 బిలియన్ డాలర్ల ఎయిడ్ సొమ్మును అందించిందని.. ఈ సొమ్మునంతా తిరిగి ఇచ్చేయాలని అన్నారు. అలాగే ఇకపై విదేశీ సాయం కూడా కోరకూడదని వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ ప్లాట్ ఫామ్‌లో ఓ పోస్టు పెట్టారు. అంతేకాకుండా బ్రిటన్‌కు చెందిన పలువురు ప్రముఖులు, జర్నిలిస్టులు కూడా ఇదే తరహాలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ప్రస్తుతం ఆ పోస్టులు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
ఇక ఆ పోస్టులపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రతిగా గట్టిగా కౌంటర్ ఇస్తూ పోస్టులు పెడుతున్నారు. దాదాపు 250 ఏళ్ల పాటు భారత్‌లో అధికారం చెలాయించి దోచుకున్న 45 ట్రిలియన్ డాలర్లను తిరిగిచ్చేయాలని ఓ భారతీయుడు పోస్టు పెట్టాడు. అలాగే ఎయిడ్ పేరిట భారత్‌కు బ్రిటన్ ఇస్తున్న సొమ్ము 2015 నుంచే ఆగిపోయిందని మరో భారతీయులు సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. 2016 నుంచి 2021 నడుమ ఇచ్చి ఎయిడ్‌గా చెప్పుకొంటున్న సొమ్ము.. మత మార్పిడుల కోసం.. ఎన్జీవోలకు ఇచ్చిన సొమ్మని మరో నెటిజన్ కౌంటర్ ఇచ్చారు.
India has become the first country to successfully land a spacecraft near the south pole of the moon so why did we send them £33.4 million in foreign aid which is set to rise to £57 million in 24/25
Time we get our money back.
— Sophie Corcoran (@sophielouisecc) August 23, 2023