I2U2 summit: ఐ2యూ2 కీలక నిర్ణయం..భారత్ లో ఫుడ్ పార్కుల ఏర్పాటు
I2U2 Summit: ఇండియా, ఇజ్రాయెల్, యూఏఈ, అమెరికా కూటమిగా ఏర్పడిన ఐ2యూ2 తొలిసమావేశం గురువారం వర్చువల్ గా జరిగింది. ఈ సమావేశంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కీలక నిర్ణయం తీసుకున్నది. భారతదేశంలో ఫుడ్ పార్కులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికోసం యూఏఈ 2 బిలియన్ డాలర్లకు పెట్టుబడిగా పెట్టనున్నది. ఇప్పటి వరకు జనాభా పరంగా భారత్ ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్నది. 2023 నాటికి భారత్ జనాభా పరంగా చైనా ను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో ఉండబోతుంది.
పెరుగుతున్న జనాభా అవసరాలకు తగినంతగా ఆహారం అవసరం అవుతుంది. మార్కెట్ పరంగా భారత్ అభివృద్ధి సాధిస్తుండటంతో ముందుచూపుతో ఆలోచించిన యూఏఈ ఇండియాలో ఫుడ్ పార్కులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ సమావేశంలో భారత ప్రధాని నరేంద్రమోడీ, ఇజ్రాయెల్ ప్రధాని యాయిర్ లాపిడ్, యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, అమెరికా అధ్యక్షుడు బైడెన్ లు పాల్గొన్నారు.