Lion Video: మహిళను హత్తుకున్న రెండు సింహాలు!
Two lions hug a woman in a zoo: మనమీదకి అడవి మృగాలు వస్తే ఏమైనా ఉందా బ్రతుకు జీవుడా అంటూ తప్పించుకుంటాము లేదా వాటికీ ఆహారమైపోతాము.అదే పులి లేదా సింహం అయితే పై ప్రాణాలు పైకే పోతాయి. ‘సింహం’ అడవిలో అత్యంత ప్రమాదకరమైన జంతువు. దాని ముందు ఏ ఇతర జంతువు నిలబడలేదు. ‘అడవి కి రాజు’ అని కూడా అంటారు. అలాంటి రెండు సింహాలు ఓ మహిళను ప్రేమగా హత్తుకుని ముద్దులు పెట్టాయి.ఇది మాత్రంనిజం అదేంటో తెలియాలంటే మనం స్టోరీలోకి వెళ్లాల్సిందే.
స్విట్జర్లాండ్‌లోని ఓ జూలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. స్విట్జర్లాండ్‌కు దేశానికి చెందిన ఓ మహిళ కొన్ని సంవత్సరాల క్రితం రెండు సింహాలను పెంచింది.అవి వారి ఇంట్లోనే తిరుగుతూ అక్కడే పెరిగాయి.వారితోనే కుటుంబ సభ్యుల్లా మెలిగాయి. అయితే అక్కడి ప్రభుత్వం సింహాలు ఇంట్లో ఉండడం ప్రమాదకరం అలాగే జనసంచారంలో ఇవి ఉండకూడదు అని తీసుకెళ్లి జూలో ఉంచారు.
ఇటీవల సింహాలను పెంచిన ఆమె వాటిని చూడడానికి జూ కి వెళ్లింది. రెండు సింహాలు ఉండే చోటుకు ఆమె వెళ్లగానే.. అవి తన యజమానిని చూసి పరుగెత్తుకుంటూ వచ్చాయి. చాలారోజుల తర్వాత తమను చూడడానికి వచ్చిన ఆ సింహాల ప్రేమ ఒక్కసారిగా ఆమెను హత్తుకునేలాచేసాయి. ఓసింహం అయితే తన యజమానిని గట్టిగా హత్తుకుని ముద్దులు పెట్టింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.ఈ వీడియో పై మరోవైపు కామెంట్ల వర్షం కురుస్తోంది.
स्विट्जरलैंड में एक महिला ने एक शेरों के जोड़े को पाला। प्रशासन ने उन्हें एक चिड़ियाघर के लिए जब्त कर लिया। 7 साल बाद जब वह महिला चिड़ियाघर घूमने आई, तो ये नज़ारा था। pic.twitter.com/ULSC6VpCT1
— तर्क साहित्य (@tarksahitya) July 11, 2022