KTR: అమెరికా పర్యటనకు (America Tour) వెళ్లిన మంత్రి కేటీఆర్ (KTR) పెట్టుబడులే లక్ష్యంగా వివిధ కంపెనీల సీఈవోలతో సమావేశమవుతున్నారు.
KTR: అమెరికా పర్యటనకు (America Tour) వెళ్లిన మంత్రి కేటీఆర్ (KTR) పెట్టుబడులే లక్ష్యంగా వివిధ కంపెనీల సీఈవోలతో సమావేశమవుతున్నారు. తెలంగాణలో (Telangana) పెట్టుబడి అవకాశాలను వారికి వివరిస్తూ భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. తాజాగా మరో రెండు ఐటీ సంస్థలు (IT Companies) తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించాయి.
హూస్టన్‌లో మండి హోల్డింగ్స్ సంస్థ సీఈవో ప్రసాద్ గుండుమోగులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణలో తాము చేసిన అభివృద్ధి, పెట్టుబడులు పెట్టేందుకు అణువుగా ఉన్న పరిస్థితులు ఇతర అంశాలను వివరించారు. దీంతో తెలంగాణలో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను (Technology Centre of Excellence) ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు ఆ కంపెనీ సీఈవో ప్రసాద్ గుండుమోగుల. త్వరలో హైదరాబాద్‌కు వస్తామని ప్రసాద్ వివిరించారు. టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేయడం ద్వారా కొత్తగా 2 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నామని పేర్కొన్నారు.
మరోవైపు మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. త్వరలో తమ సంస్థను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు బెయిన్ క్యాపిటల్ గ్రూప్‌నకు చెందిన వీఎక్స్ఐ గ్లోబల్ సొల్యూషన్స్ (VXI Global Solutions) ప్రకటించింది. ప్రస్తుతం ఈ కంపెనీ వరల్డ్ వైడ్‌గా 42 దేశాల్లో సేవలు అందిస్తోంది. హైదరాబాద్‌లో తమ సంస్థను ఏర్పాటు చేయడం ద్వారా దాదాపు 10 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నామని ఆ కంపెనీ వెల్లడించింది.