Xi Jinping : హ్యాట్రిక్ కొట్టిన జిన్‌పింగ్
xi-jinping: జిన్‌పింగ్ ఈదఫా చైనా అధ్యక్ష పదవి నుంచి తొలగుతారని నిన్న మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా జిన్ పింగ్ మూడోసారి కూడా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మూడోసారి కూడా జిన్‌పింగ్ అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టేందుకు చైనా పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. మూడోసారి ఆయన చైనా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. చైనా అధ్యక్ష పదవీ విరమణ వయసు 68 అయినప్పటికీ.. 2018లో పార్టీ రాజ్యాంగాన్ని సవరించిన నేపథ్యంలో జిన్‌పింగ్ కొనసాగుతున్నారు. ప్రస్తుతం జిన్‌పింగ్ వయసు 69 ఏళ్లు.
చైనా నిర్మాత మావో జెడాంగ్ తర్వాత అధికారంలోకి వచ్చిన నేతలంతా రెండు పర్యాయాలకు మించి పదవిలో లేరు. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం, అధ్యక్ష బాధ్యతలు, సైన్యం పగ్గాలు అన్నీ ఇప్పటికే చేతుల్లోకి తీసుకున్న జిన్‌పింగ్.. చైనాలోనే అత్యంత శక్తిమంత నేతగా అవతరించారు. దేశాధ్యక్ష పదవికి రెండుసార్లకు మించి పదవిలో ఉండకూడదని.. డెండ్ జియవోపింగ్ నిర్దేశించారు. అయితే దీనిని కూడా తోసిపుచ్చి.. జిన్‌పింగ్ అధ్యక్షుడు కావడం గమనార్హం. వరుసగా ఎన్నికవుతున్న జిన్‌పింగ్ పార్టీపై పట్టు పెంచుకుంటున్నారు. ఫలితంగా చైనాలో మావో జెడాంగ్ తర్వాత అత్యంత శక్తిమంతమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు.