వైసీపీ శ్రేణుల కంటే తాలిబన్లు నయం: నారా లోకేష్
వైసీపీపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ శ్రేణులు తాలిబన్లలా వ్యవహరిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకానొక సమయంలో వైసీపీ శ్రేణులకంటే తాలిబన్లే నయమనిపిస్తుందని లోకేష్ అన్నారు. పదో తరగతి పేపర్లు ఎత్తుకొచ్చిన చరిత్ర జగన్‌ది అయితే.. పదో తరగతిలో తమ కూతుర్లు టాప్ ర్యాంకులు సాధించాలని మైనార్టీ విద్యార్థినిని వెంటాడి వేధించి బలవన్మరణానికి పాల్పడేలా చేసిన చరిత్ర వైసీపీ నేతలదన్నారు.
బంగారు భవిష్యత్తు ఉన్న మిస్బా మరణానికి కారణమైన వైసీపీ నేత సునీల్, అతనికి సహకరించిన ప్రిన్సిపల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు. మరోవైపు రాష్ట్రంలో తాలిబన్ల పాలనలో ప్రజలు కృంగి కృషించి పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో తాలిబన్ల పాలనకు రోజులు దగ్గర పడ్డాయన్న లోకేష్.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ నామరూపం లేకుండా పోతుందని జోస్యం చెప్పారు.