Libya Floods: మొన్నటి వరకు ఎత్తైన భవనాలు, వేలాదిమంది జనాలతో కళకళలాడిని అందమైన డెన్నా నగరం.. ఇప్పుడు శవాల దిబ్బగా మారిపోయింది. సుందరమైన ఆ నగరం డేనియల్ తుఫాన్ జలప్రళయానికి ఇప్పుడు స్మశాన వాటికలా తయారైంది.
Libya Floods: మొన్నటి వరకు ఎత్తైన భవనాలు, వేలాదిమంది జనాలతో కళకళలాడిని అందమైన డెన్నా నగరం.. ఇప్పుడు శవాల దిబ్బగా మారిపోయింది. సుందరమైన ఆ నగరం డేనియల్ తుఫాన్ జలప్రళయానికి ఇప్పుడు స్మశాన వాటికలా తయారైంది. లిబియా(Libya) వరదల వల్ల చనిపోయిన వారి సంఖ్య ఇప్పటికే 11,300కి చేరుకుందని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. మరో 10వేల మందికి పైగా గల్లంతయినట్లు ఐరాస తెలిపింది. తూర్పు లిబియాలోని డెర్నా (Derna in eastern Libya)కాకుండా మరో చోట కూడా వరదల వల్ల 170 మంది చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు డెర్నాలో రెండు డ్యామ్‌లు కొట్టుకుపోయిన ఘటనపై.. ఉన్నతస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.
డేనియల్ తుఫాను(Daniel Tufan) ఈశాన్య లిబియాను తాకి.. తర్వాత భారీ వరదలుగా మారడంతో జల ప్రళయం ఏర్పడింది. అనధికారికంగా ఈ మరణాల సంఖ్య 20,000 వరకు ఉంటుందని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. ఆఫ్రికా దేశమైన లిబియా(Libya)లో కొన్నేళ్లుగా తీవ్రమైన సంక్షోభం వెంటాడుతోంది. అంతర్యుద్ధం, మానవ సంక్షోభం వంటి సమస్యలతో ఉన్న ఈ దేశంలో ఈ విపత్తు..ఇప్పుడు దేశ పరిస్థితిని మరింత దిగజారిపోయింది. ఇప్పటికే డెర్నాలో తాగునీటి సమస్యలు ఏర్పడ్డాయి. దీనికి తోడు కలుషిత నీటిని తాగిన వందలాది మంది తీవ్ర అనారోగ్యం పాలయ్యారని అధికారులు చెబుతున్నారు. మరోవైపు అక్కడ ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి.
మరోవైపు.. ఈ జలప్రళయానికి అతలాకుతలమైన లిబియాను ఆదుకోవడానికి ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలు సహాయక బృందాలను పంపించడంతో పాటు క్షతగాత్రుల కోసం సరుకులను కూడా రవాణా చేశాయి. తమ దేశం నుంచి రెండు హెలికాప్టర్లు, బుల్‌డోజర్‌లు, కనీస అవసరాలకు వాడే వస్తువులతో పాటు, పంపులతో కూడాన ఓడ డెర్నాకు చేరుకుందని ఇటాలియన్ రాయబార కార్యాలయం తెలిపింది. ఫ్రాన్స్ నుంచి ఫీల్డ్ హాస్పిటల్‌తో పాటు సౌదీ అరేబియా, కువైట్ నుంచి టన్నుల కొద్దీ ఆహారపదార్ధాలతో పాటు కనీస అవసరాలు తీర్చేలా సామానులు అక్కడకు చేరుకున్నాయి. అటు డెర్నాకు పశ్చిమాన 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న.. అల్-బైడాలోని ప్రజలు తమంతట తామే స్వయంగా వచ్చి అక్కడున్న రోడ్లు, ఇళ్లలో మట్టి దిబ్బలను తొలగించడానికి తమవంతు సహకారం అందిస్తున్నారు.
Daniel Tufan, Derna in eastern Libya, Libya ,Libya Floods, More than 11 thousand people died