అఫ్గనిస్థాన్‌లో అధికారం చేజిక్కించుకున్నప్పటి నుంచి తాలిబన్లు (Talibans) చెలరేగి పోతున్నారు. వారి అరాచకాలకు అడ్డూ.. అదుపూ లేకుండా పోతోంది. ముఖ్యంగా మహిళలపై కఠిన ఆంక్షలు విధిస్తున్నారు.
Afghanistan: అఫ్గనిస్థాన్‌లో అధికారం చేజిక్కించుకున్నప్పటి నుంచి తాలిబన్లు (Talibans) చెలరేగి పోతున్నారు. వారి అరాచకాలకు అడ్డూ.. అదుపూ లేకుండా పోతోంది. ముఖ్యంగా మహిళలపై కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం దూర ప్రయాణాలు.. బ్యూటీ పార్లర్లపై నిషేధం విధించారు. అంతకంటే ముందు యూనివర్సిటీ మహిళలు చదువుకునేందుకు అనుమతి నిరాకరించారు. ఇప్పుడు మరో కఠిన ఆంక్షను విధించారు. పార్కుల్లోకి (Park) మహిళలు హిజాబ్ ధరించకుండా వెళ్తే అనుమతి నిరాకరించారు.
దేశంలోని అన్ని జాతీయ పార్కుల్లోకి మహిళలు హిజాబ్ ధరించకుండా వెళ్తే అనుమతించకూడాదని తాలిబన్లు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ వైస్ అండ్ వర్చ్యుమినిస్ట్రీ మంత్రి మహ్మద్ ఖలీద్ హనాఫీ ఉత్తర్వులు జారీ చేశారు. అవసరమైతే హిజాబ్ ధరించని మహిళలపై బల ప్రయోగం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. మహిళలు పార్కులకు వెళ్లడం తప్పనిసరి కాదని ఖలీద్ హనాఫీ పేర్కొన్నారు. తాలిబన్లు తీసుకున్న ఈ నిర్ణయంపై అక్కడి మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. మహిళలకు పూర్తిగా స్వేచ్ఛ లేకుండా.. ఇంటికే పరిమితం చేస్తున్నారని ఆందోళన చేపట్టాయి. తాలిబన్లు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి.