తెలుగు ప్రజలు ఎంతో పవిత్రంగా భావించే స్వస్తిక్ గుర్తు ఒక తెలుగు జంటకు శాపంగా మారింది. పొరుగింటి వ్యక్తి అపార్ధం కారణంగా ఆ జంట కష్టాలు అనుభవిస్తోంది. నాజీలు వాడే గుర్తు వాడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తెలుగు వ్యక్తిని అరెస్టు చేశారు. ప్రస్తుతం తన భర్తను విడిపించుకోడానికి అతడి భార్య న్యాయపోరాటం చేస్తోంది.
Swastika symbol in Saudi Arabia lands a Telugu family into trouble
తెలుగు ప్రజలు ఎంతో పవిత్రంగా భావించే స్వస్తిక్ గుర్తు ఒక తెలుగు జంటకు శాపంగా మారింది. పొరుగింటి వ్యక్తి అపార్ధం కారణంగా ఆ జంట కష్టాలు అనుభవిస్తోంది. నాజీలు వాడే గుర్తు వాడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తెలుగు వ్యక్తిని అరెస్టు చేశారు. ప్రస్తుతం తన భర్తను విడిపించుకోడానికి అతడి భార్య న్యాయపోరాటం చేస్తోంది. ఈ ఘటన సౌదీ అరేబియాలో చోటుచేసుకుంది.
గుంటూరు జిల్లాకు చెందిన అరవింద్ ఇటీవలే సౌదీ అరేబియాకు మకాం మార్చాడు. సౌదీలోని ఈస్ట్రన్ ప్రావిన్స్‌లో ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్నాడు. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే స్వస్తిక్ గుర్తును తన ఇంటి ప్రధాన ద్వారంపై అంటించాడు. అది గమనించిన ఓ పొరుగింటి వ్యక్తి ఆ గుర్తును నాజీలు ఉపయోగించే గుర్తుగా పొరబడ్డాడు. దాన్ని తొలగించమని హెచ్చరించాడు. అరవింద్ అతడి మాటలను పెద్దగా పట్టించుకోలేదు. ఇది ఎంతో పవిత్రమైన గుర్తు అని చెప్పి ఊరుకున్నాడు.
ఆ పొరిగింటి వ్యక్తి మాత్రం ఊరుకోలేదు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ గుర్తు తమ దేశంలో ఉపయోగించరాదని అది చట్ట విరుద్ధమని పోలీసులకు కంప్లెంట్ చేశాడు. రంగంలో దిగిన పోలీసులు ముందూ వెనక ఆలోచించకుండా అరవింద్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం అరవింద్ భార్య న్యాయపోరాటం చేస్తోంది. భర్తను పోలీసుల చెరనుంచి కాపాడుకోడానికి ప్రయత్నిస్తోంది.
అరవింద్ భార్య లీలా కుమారి ఎంతో ధైర్యంగా తన భర్తను విడిపించుకోడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇండియన్ ఎంబసీని ఆశ్రయించింది. అదే విధంగా తెలుగు సామాజిక కార్యకర్త ముజమ్మీ షేక్ సాయం తీసుకుంటోంది. ప్రముఖ ఇండియన్ కమ్యూనిటీ వాలంటీర్ నాస్ ఒక్కమ్ సాయం కూడా కోరుతోంది.