Srilanka crisis: లంకలో దారుణం..ఆహారం కోసం…
Srilanka crisis women sever hungry:
లంకలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. ఆహారం కోసం ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు. ఇప్పటికే శ్రీలంక అనేక ఇబ్బందులు పడుతున్నది. లంకలో అధికారిక మార్పిడి జరిగినప్పటికీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు లేకపోవడం విశేషం. ఇక ఇదిలా ఉంటె, మహిళలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఆహారం దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. కొందరు మహిళలు ఆహారం కోసం చివరకు ఒళ్ళు అమ్ముకోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి అంటే అర్థం చేసుకోవచ్చు. అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే ఎన్నికైన రోజునే ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకోవడం విశేషం. త్వరలోనే లంకలో పరిస్థితులు చక్కబడతాయని అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో లంక మళ్లీ కోలుకోవాలంటే, పదేళ్ళపైగా పడుతుందని భావిస్తున్నారు ఆర్ధిక వేత్తలు. కీలకమైన తేయాకు, రబ్బరు పరిశ్రమలు మూత పడ్డాయి. వాటిలో పనిచేసే లక్షలాది కార్మికులు రోడ్డున పడ్డారు. లక్షలాదిమంది చేతిలో చిల్లిగవ్వ లేకుండా దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. దేశంలో చాలామంది బ్యాంకు అకౌంట్స్ లో జీరో బ్యాలెన్స్ తో ఉన్నాయి. పెట్రోలు, డీజిల్ కొరత వల్ల వాహనాలు లేకపోవడంతో లంకా వైపు విదేశీయులు కన్నెత్తి చూడటం లేదు. ఇప్పటికే సింగపూర్, యూకె, బ్రిటన్ దేశాల నుండి పర్యాటలకు ఆగిపోయారు.