Srilanka Political Crisis: శ్రీలంకకు కొత్త నాయకత్వం..అధ్యక్షుడి ఎన్నిక ఎప్పుడంటే..?
Sri lanka president election: రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో కొత్త నాయకత్వం ఈరోజు కొలువుదీరబోతోంది. 225 మంది సభ్యులున్న శ్రీలంక పార్లమెంట్ లో దేశ నూతన అధ్యక్షుడు, ప్రధానమంత్రిని ఈరోజు ఎన్నుకోనున్నారు. అధ్యక్ష పదవి రేసులో ప్రస్తుత తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘె కంటే అధికార పార్టీ శ్రీలంక ఎస్ఎల్పీపీ బలపరిచిన దులస్ అలహాప్పెరుమా ముందున్నట్లు తెలుస్తోంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు సాజిత్ తొలుత అధ్యక్ష పదవికి పోటీచేయాలనుకున్నా చివరకు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని అలహాప్పెరుమాకు మద్దతు ప్రకటించారు. ఆయన ప్రధానిగా ఎన్నికవడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తుంది. లంక పార్లమెంటు తమ దేశాధ్యక్షుడిని నేరుగా ఎన్నుకోనుండటం గత 44 ఏళ్లలో ఇదే తొలిసారి.
పార్లమెంటులో మొత్తం 225 మంది సభ్యులున్నారు. ఇందులో ఎస్ఎల్పీపీ బలం 101గా, ఎస్జేబీ బలం 50గా ఉంది. ఎన్నికల నేపథ్యంలో లంకలో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని కొలంబోలోని ఇండియన్ హైకమిషన్ సూచించింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వాటికి అనుగుణంగా ప్రయాణాలు, పనులు చేసుకోవాలని తెలిపింది. అవసరమైతే తమను సంప్రదించాలని సూచించింది. శ్రీలంక ప్రతిపక్ష పార్టీ నాయకుడు సాజిత్ ప్రేమదాస సోషల్ మీడియా వేదికగా భారత్కి ఒక విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ‘ప్రధాని నరేంద్ర మోడీకి, భారత్లోని అన్ని రాజకీయ పార్టీలకు నా హృదయ పూర్వక అభ్యర్థన. అధ్యక్షుడిగా ఎవరూ ఎన్నికైనా భారత్ లంక తల్లికి మద్దతిచ్చి సహాయ చేస్తు ఉండాలిని కోరారు’.