Biden Hidden Documents: బైడెన్ ప్రైవేట్ కార్యాలయంలో దొరికిన ఆ రహస్య పత్రాల్లో ఏముంది?
Biden Hidden Documents: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చిక్కుల్లో పడ్డారు. బైడన్ ప్రైవేట్ కార్యాలయంలో కొన్ని రహస్య పత్రాలు బయడపడటంతో ఆ పత్రాల్లో ఏమున్నదనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. అటు బైడెన్ కూడా ఇదే విషయాన్ని తెలియజేశారు. ఆ రహస్య పత్రాల్లో ఏమున్నదనే విషయాలు తనకు కూడా తెలియదని, తన న్యాయవాదులు ఇబ్బందులు లేవు నిశ్చంతగా ఉండాలని చెప్పినట్లు బైడెన్ పేర్కొన్నారు. దర్యాప్తుకు తనవంతూ పూర్తిగా సహకరిస్తానని కూడా బైడెన్ చెప్పారు.
అమెరికా అధ్యక్షులకు సంబంధించి ఇలా రహస్య పత్రాలు బయటపడుతుండటంతో మీడియా మొత్తం దీని చుట్టూ కథనాలు ప్రచురిస్తున్నాయి. అసలు ఆ రహస్య పత్రాల్లో ఏమున్నది. నిజంగా రహస్యాలు దాగున్నాయా లేదంటే, ఇంకేమైనా సమాచారం ఉన్నదా అనేకోణంలో పత్రికల్లో మీడియాలో వార్తలు ప్రచురితమౌతున్నాయి. గతేడాది జనవరి నెలలో మార్ ఎ లాగ్ ఎస్టేట్‌లో ట్రంప్ కు సంబంధించి 325 రహస్య పత్రాలు లభ్యమయ్యాయి. దీనిపై ఎబ్బీఐ దర్యాప్తు జరుపుతున్నది. తాజాగా బైడెన్ పాత కార్యాలయంలో థింక్ ట్యాంక్ వద్ధ రహస్య పత్రాలు లభించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జో బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఆ సమయానికి చెందిన క్లాసిఫైడ్ పత్రాలు కావడంతో ట్రంప్ మద్దతు దారులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. దీనిపై సమగ్రమైన విచారణ జరపాలని పట్టుబడుతున్నారు. ఇక కొందరైతే ఈ పత్రాల్లో ఉక్రెయిన్, ఇరాన్, యూకే దేశాలకు సంబంధించిన సున్నితమైన అంశాలు ఉన్నాయని వార్తలను ప్రచురిస్తున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉన్నదో దర్యాప్తు సంస్థలే తేల్చాలి. రహస్య పత్రాల అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉక్రెయిన్‌కు సంబంధించిన సున్నిత అంశం ఈ పత్రాల్లో ఉందనే వార్తలు రావడంతో, ఉక్రెయిన్‌పై అప్పట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు.
అప్పటి నుండే రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన సమాచారం అమెరికా వద్ద ఉన్నదా? ఒకవేళ ఉంటే ఆ విషయాలను ముందుగానే ఎందుకు బయటపెట్టి ఉక్రెయిన్‌ను హెచ్చరించలేదనే కోణంలో వివిధ మీడియాలలో చర్చించుకుంటున్నారు. ఇక బైడెన్ మద్దతుదారులైతే, దొరికిన రహస్య పత్రాలు కేవలం పది మాత్రమేనని, కాని ట్రంప్ ఎస్టేట్‌లో ఏకంగా 325 రహస్య పత్రాలు దొరికాయని చెబుతున్నారు. మాజీ, ప్రస్తుత అధ్యక్షులకు రహస్య పత్రాల మరకలు అంటుకోవడంతో వాటిని ఎలా వదిలించుకుంటారో చూడాలి.
పాతకార్యాలయాన్ని క్లియర్ చేస్తున్న సమయంలో ఈ పత్రాలు బయటపడినట్టు అధికారులు చెబుతున్నారు. ఇందులో ఉన్న సమాచారం తెలుసుకునేందుకు ఆ పత్రాలను అటార్నీ జనరల్ మెరిక్ గార్లాండ్ చికాగోలోని యూఎస్ అటార్నీకి అప్పగించారు. ఆ సమాచారానికి సంబంధించిన పూర్తి వివరాలు వచ్చేంత వరకు వివిధ రకాల కోణాల్లో ఈ రహస్య పత్రాలపై వార్తలు ప్రచురితమౌతూనే ఉంటాయి.
అయితే, ఈ రహస్య పత్రాలు గతేడాది నవంబర్ నెలలోనే బయటపడినట్లు తెలుస్తోంది. అమెరికాలో మధ్యంతర ఎన్నికలు ఉండటంతో వీటిని బయటపెట్టకుండా రహస్యంగా ఉంచారని వార్తలు వస్తున్నాయి. ఈ మధ్యంతర ఎన్నికలు నువ్వానేనా అన్నట్టు సాగినా, చివరకు ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్లు స్వల్ప మెజారిటీని సాధించారు. ఎన్నికల కోసమే రహస్య పత్రాలను బయటపెట్టకుండా దాచి ఉంచారా లేక దేనికోసమైనా బయటపెట్టకుండా ఉన్నారా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉన్నది.