అమెరికాలో (America) గన్ కల్చర్ పెట్రేగిపోతోంది. తుపాకీ తూటాలతో అమెరికా వాసులు హడలెత్తిపోతున్నారు. కొందరు దుండగులు విచ్చలవిడిగా కాల్పులకు పాల్పడుతున్నారు. ఇలానే ఓ వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్‌పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
USA: అమెరికాలో (America) గన్ కల్చర్ పెట్రేగిపోతోంది. తుపాకీ తూటాలతో అమెరికా వాసులు హడలెత్తిపోతున్నారు. కొందరు దుండగులు విచ్చలవిడిగా కాల్పులకు పాల్పడుతున్నారు. ఇలానే ఓ వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్‌పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
సిమ్రన్‌జిత్ సింగ్ అనే 29 ఏళ్ల వ్యక్తి క్యాలిఫోర్నియాలో నివాసం ఉంటున్నాడు. శనివారం తన గర్ల్‌ఫ్రెండ్‌ను తీసుకొని ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లారు. కొద్దిసేపు సరదాగా గడిపారు. ఆ తర్వాత షాపింగ్ చేసుకొని.. పార్కింగ్‌లో ఉన్న కారు వద్దకు వెళ్లారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో కోపంతో రగిలిపోయిన సిమ్రన్‌జిత్ సింగ్ కారులో నుంచి తుపాకీ తీసి తన గర్ల్‌ఫ్రెండ్‌పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత సిమ్రన్‌జిత్ అక్కడి నుంచి పారిపోయాడు.
షాపింగ్ మాల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకొని డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత పార్కింగ్ ప్లేస్‌లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. దీంతో ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తప్పించుకొని తిరుగుతున్న సిమ్రన్‌జిత్ సింగ్ కోసం తీవ్రంగా గాలించారు. చివరికి ఓ స్టోర్ వద్ద అతడిని గుర్తించి అరెస్ట్ చేశారు.