Hunger Deaths in North Korea: ఆహార సంక్షోభంలో ఉత్తర కొరియా.. పెరుగుతున్న ఆకలి చావులు
Hunger Deaths in North Korea: ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం రోజు రోజుకు పెరిగిపోతున్నది. ఆహార సంక్షోభం పెరిగిపోతున్న నేతృత్వంలో క్రమంగా ఆకలి చావులు పెరుగుతున్నాయి. దీంతో ఆ దేశం అల్లకల్లోలంగా మారింది. ఒకవైపు చుట్టుపక్కల దేశాలతో వైరం కారణంగా ఆయుధ సంపత్తిని పెంచుకోవడంపై దృష్టి సారించిన కిమ్ సర్కార్, ప్రజా క్షేమాన్ని చాలా వరకు పట్టించుకోలేదు. పైగా, కరోనా మహమ్మారి కారణంగా కఠినమైన లాక్‌డౌన్‌లు విధించడంతో వ్యవసాయ రంగం కుంటుపడింది. దీంతో ఆహారానికి కొరత ఏర్పడింది. ప్రస్తుతం ప్రజలు తీవ్రమైన కొరతను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కిమ్ ఆహార సంక్షోభంపై దృష్టిసారించారు. ఈ కొరత నుండి బయటపడేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
మిత్రదేశాల నుండి ఆహారాన్ని దిగుమతి చేసుకునేందుకు ఒప్పందాలు చేసుకోవడమే కాకుండా, దేశీయంగా పంట ఉత్పత్తులను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆహార సంక్షోభం నేతృత్వంలో కిమ్ జాతీయ మీడియాతో మాట్లాడారు. దేశంలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలని పిలుపునిచ్చారు. సత్వరమై మార్పులను ప్రవేశపెట్టాలని సూచించారు. వేగంగా ప్రజలకు ఆహారం అందించే విధంగా మార్పులు చేయాలని తెలిపారు. 1990 దశకంలోనూ దేశంలో తీవ్రమైన ఆహార సంక్షోభం తలెత్తింది. ఈ సంక్షోభం కారణంగా దేశంలో లక్షలాది మంది ప్రజలు మరణించారు. తాజాగా సంభవించిన ఆహార సంక్షోభం అంతపెద్దది కాదని, తీవ్రత పెరగక ముందే సత్వర చర్యలు తీసుకోవాలని కిమ్ అధికారులను ఆదేశించారు.