Russia Ukraine War: ఉక్రెయిన్‌పై మరోసారి విరుచుకుపడిన రష్యా
Russia Ukraine War: ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ప్రారంభమయ్యి ఏడాది దాటిపోయింది. గతేడాది ఫిబ్రవరి 24వ తేదీన స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ పేరుతో రష్యా యుద్ధాన్ని ప్రారంభించింది. కొద్ది రోజుల్లోనే ముగిసిపిపోతుందని అనుకున్నా, నాటో సహాయంతో ఉక్రెయిన్ పోరాటం చేస్తూనే ఉన్నది. ఇరు దేశాలకు చెందిన సైనికులు భారీ సంఖ్యలో మరణిస్తున్నా రెండు దేశాలు వెనక్కి తగ్గడం లేదు. రష్యా తాజాగా మరో మూడు లక్షల మంది సైనికులను రిక్రూట్ చేసుకుంది. వీరిని ఉక్రెయిన్‌కు పంపి యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నది. కొన్ని రోజులుగా ఉక్రెయిన్ నుండే యుద్ధం చేస్తున్న రష్యా, తాజాగా క్షిపణులతో విరుచుకుపడింది.
81 క్షిపణులతో దాడులు చేసింది. 8 డ్రోన్‌లను కూడా ప్రయోగించింది. గురువారం ఒక్కరోజే భారీ సంఖ్యలో క్షిపణులు దాడులు చేశాయి. ఈ క్షిపణుల దాడులతో ఉక్రెయిన్‌లోని పలు నగరాలు వణికిపోయాయి. 10 రీజియన్లలో నివాస భవనాలతో పాటు కీలకమైన మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నట్లుగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలియజేశాడు. రష్యా ఎన్ని కుతంత్రాలు చేసినా తాము వెనక్కి తగ్గేది లేదని ఉక్రెయిన్ స్పష్టం చేసింది. ఎలాగైనా ఉక్రెయిన్‌ను దారిలోకి తీసుకురావాలని పుతిన్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. రష్యా వద్ద ఆయుధాలు లేవన్నది అపోహేనని, తమ వద్ద సరికొత్త ఆయుధాలు అనేకం ఉన్నా, సంప్రదాయ ఆయుధాలనే వినియోగిస్తున్నట్లు రష్యా పేర్కొన్నది.