Lion: చిన్నప్పుడు స్కూల్లో (school) తాడు లాగడం గేమ్ ఆడే ఉంటారు. రెండు బృందాలుగా ఏర్పడి.. తాడును రెండు వైపుల నుంచి లాగడానిక ప్రయత్నిస్తారు.
Lion: చిన్నప్పుడు స్కూల్లో (school) తాడు లాగడం గేమ్ ఆడే ఉంటారు. రెండు బృందాలుగా ఏర్పడి.. తాడును రెండు వైపుల నుంచి లాగడానిక ప్రయత్నిస్తారు. అందులో ఏ జట్టుకు అయితే ఎక్కువ బలం ఉంటుందో ఆ జట్టు విజేతగా నిలుస్తుంటుంది. అయితే కొందరు బాడీ బిల్డర్లు (Bodybuilders) ఏకంగా సింహంతో (Lion) ఈ గేమ్ ఆడడానికి ప్రయత్నించారు. చివరికి సింహం బలాన్ని తట్టుకోలేక ఓడిపోయామని అంగీకరించారు.
ఓ జూ పార్క్‌లో కొందరు బాడీ బిల్డర్లు రోప్ పుల్లింగ్ గేమ్ ఆడారు. బోనులో ఉండి ఓ గట్టి తాడును ఆడ సింహం నోటితో పట్టుకొని లాగుతుండగా.. బయటి నుంచి మరొక కొనను ముగ్గురు బాడీ బిల్డర్లు (Bodybuilders) పట్టుకొని లాగారు. బాడీ బిల్డర్లు తమ బలమంతా పెట్టి ప్రయత్నించినప్పటికీ సింహాన్ని ఇంచు కూడా కదలించలేకపోయారు. వారి బలం అంతా సింహం ముందు విఫలమయింది. చివరికి దానిని కదలించడం వారి వల్ల కాక ఓటమిని అంగీకరించారు. ఈ గేమ్‌ను చూస్తూ అక్కడున్న వారంతా చప్పట్లు కొడుతూ ఫుల్ ఎంజాయ్ చేశారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ కొందరు ఆ దృశ్యాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో (Social media) పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన నెటిజన్లు నెటిజన్లు భిన్నరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
Strength of a Lioness pic.twitter.com/dGxOEWWOnL
— The Best (@Figensport) May 18, 2023