అమెరికాలోని ఇల్లినాయిస్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ మహబూబ్నగర్ జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందాడు. మహబూబ్నగర్ జిల్లా భూత్పూరు మండల యువకుడు మహేశ్ పీజీ చదివేందుకు యూఎస్ వెళ్ళాడు. ఉన్నత చదువుల కోసం గత డిసెంబర్లో అమెరికా వెళ్లాడు. అక్కడ కాంకోర్డియా యూనివర్శిటీలో ఎమ్ఎస్ చేస్తున్నాడు.
Road accident in America: అమెరికాలోని ఇల్లినాయిస్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ మహబూబ్నగర్ జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందాడు. మహబూబ్నగర్ జిల్లా భూత్పూరు మండల యువకుడు మహేశ్ పీజీ చదివేందుకు యూఎస్ వెళ్ళాడు. ఉన్నత చదువుల కోసం గత డిసెంబర్లో అమెరికా వెళ్లాడు. అక్కడ కాంకోర్డియా యూనివర్శిటీలో ఎమ్ఎస్ చేస్తున్నాడు. అక్కడ మిన్నెసోటాలో ఉంటున్నాడు. అయితే మహేష్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి మంగళవారం కారులో ప్రయాణిస్తుండగా.. ఆ కారు ప్రమాదానికి గురైంది. కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. దీంతో అందులో ఉన్న మహేష్ తీవ్ర గాయాలతో చనిపోయాడు. మహేష్ మరణవార్తను స్నేహితులు తండ్రికి ఫోన్ చేసి చెప్పారు. ఈ విషయం తెలియడంతో ఆ కుటుంబం మొత్తం ఒక్క సారిగా షాక్ కు గురయ్యింది. కాగా.. మహేష్ మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు
మహబూబ్నగర్ భూత్పూర్ మండలం కప్పెట గ్రామానికి చెందిన బోయ వెంకట్రాములు, శకుంతల పెద్ద కుమారుడు . వీరిది మధ్య తరగతి కుటుంబం. కుటుంబాన్ని పోషించేందుకు తండ్రి మహారాష్ట్రకు వెళ్లి, అక్కడే ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. తల్లిదండ్రుల కష్టాన్ని చూసి పెరిగిన మహేష్ ఉన్నత విద్య పూర్తి చేసి కుటుంబానికి అండగా నిలుద్దామనుకున్నాడుకానీ ఇంతలోనే మృత్యు ఒడిలోకి వెళ్ళాడు. కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.