Rishi Sunak: సునాక్ కు ఓటమి తప్పేలా లేదు
Rishi Sunak: బ్రిటీష్ ప్రధాన మంత్రి రిషి సునక్, అతని 15 మంది కేబినెట్ మంత్రులు 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోనున్నారని తాజా సర్వే చెప్పింది. ‘బెస్ట్ ఫర్ బ్రిటన్’ అనేసంస్థ చేపట్టిన సర్వే ఫలితాలను ది ఇండిపెండెంట్ వార్తాపత్రిక రిపోర్ట్ చేసింది. ప్రధాని రిషిసునక్, ఉప ప్రధాని డొమ్నిక్ రాబ్, ఆరోగ్య కార్యదర్శి స్టీవ్ బార్ల్కే సహా పలువురు సీనియర్లు 2024లో జరగనున్న ఎన్నికల్లో ఓటమి పాలయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది.
కేవలం ఐదుగురు కేబినెట్ మంత్రులు జెరెమీ హంట్, భారతీయ సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్ మాన్ , మైఖేల్ గోవ్, నదీమ్ జవావి, కెమీ బాడెనోచ్‌లకు మాత్రమే విజయావకాశాలు ఉన్నాయని పేర్కొంది. రిషిసునక్ క్యాబినెట్ ఓటమి పాలవుతారని అంతర్జాతీయ విలువల కోసం, ఇయుతో సన్నిహిత సంబంధాల కోసం ప్రచారంచేసే బృందం బెస్ట్ ఫర్ బ్రిటన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నవొమి స్మిత్ పేర్కొన్నారు. లిజ్ ట్రస్ నుండి రిషిసునక్ గతేడాది బ్రిటన్ అధ్యక్షుడిగా బాధ్యలు స్వీకరించిన సంగతి తెలిసిందే.
ఈ కొత్త సంవత్సరంలో తన అదృష్టాన్ని పునరుద్ధరించడానికి కష్టపడుతున్నాడు. కానీ ఇటీవలి పోల్‌లు లేబర్ పార్టీకి దాదాపు 20 పాయింట్ల ఆధిక్యాన్ని అందించాయి. లిజ్ ట్రస్ నుండి శునాక్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొద్దిపాటి పోల్ బౌన్స్ ఇప్పుడు ‘ఫ్లాట్‌లైన్’ అయిందని పోలింగ్ నిపుణులు తెలిపారు. ఇటీవల వెలువడిన ఎన్నికల్లో సర్వేల్లో కన్జర్వేటివ్ పార్టీ కంటే లేబర్ పార్టీ 20 పాయింట్ల ముందంజలో ఉంది. దీంతో టోరీ భవితవ్యాన్ని మార్చేందుకు సునాక్ ఈ ఏడాది ప్రారంభం నుండి తీవ్రంగా శ్రమిస్తున్నారు.