US President Elections 2024: రిపబ్లికన్ అధ్యక్ష రేసులో నిక్కీ హేలీ… త్వరలోనే నిర్ణయం
US President Elections 2024: 2024లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జగరనున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున మరోసారి పోటీ చేస్తానని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. ఒకవేళ పార్టీ తనను కాదని అంటే స్వతంత్ర్యంగా పోటీ చేస్తానని కూడా చెప్పాడు. ఇక ఇదిలా ఉంటే, రిపబ్లికన్ పార్టీ నుండి పోటీ మరో అభ్యర్థి కూడా సై అంటున్నారు. అదేవరో కాదు భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ. తాను కూడా అధ్యక్ష రేసులో ఉన్నట్లు ప్రకటించారు. బరిలో దిగేందుకు అవకాశాలున్నాయని సంకేతాలిచ్చారు. త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తానని అన్నారు.
కొత్త నాయకత్వం అవసరం ఉందని, ఆ నాయకురాలిని తానే అవుతానని నిక్కీ హేలీ పేర్కొనడం విశేషం. ఇక ఫ్లోరిడా గవర్నర్ ర్యాన్ సైతం అధ్యక్ష ఎన్నికల బరిలో దిగేందుకు పావులు కదుపుతున్నారు. రిపబ్లికన్ పార్టీలో పోటీ పెరుగుతుండటంతో పార్టీ అధినాయకత్వం ఫైనల్‌గా ఎవర్ని బరిలోకి దించుతుందో చూడాలి. ఒకవేళ నిక్కీ హేలీని బరిలోకి దించితే అటు, డెమెక్రాట్స్ తరపున ఉపాధ్యక్షురాలిగా ఉన్న కమలా హ్యారిస్ బరిలోకి దిగే అవకాశం ఉంటుంది. ఇద్దరూ భారతీయ సంతతికి చెందిన మహిళలే కావడంతో ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంటుంది.