యూరప్‌లో ఆర్థిక మాంద్యం ఇబ్బందులు పెడుతున్నది. ఇప్పటికే జర్మనీలో మాంద్యం ఛాయలు కనిపిస్తున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో వృద్ధిరేటు 0.5 శాతం, 2023 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 0.3 శాతం వృద్ధి రేటు తక్కువగా నమోదైంది.
Germany Economic Crisis:యూరప్‌లో ఆర్థిక మాంద్యం ఇబ్బందులు పెడుతున్నది. ఇప్పటికే జర్మనీలో మాంద్యం ఛాయలు కనిపిస్తున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో వృద్ధిరేటు 0.5 శాతం, 2023 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 0.3 శాతం వృద్ధి రేటు తక్కువగా నమోదైంది. రెండు త్రైమాసికాలు ఆర్థిక రేటు తక్కువగా నమోదైతే మాద్యం కింద లెక్కిస్తారు. ఈ మాంద్యం రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మాంద్యం మొదలుకావడంతో జర్మనీలో ఆర్థిక కుంగుబాటు మొదలైంది. దీని ప్రభావం ఇతర దేశాలపై కూడా పడే అవకాశం ఉంది. యూరప్‌లోని కొన్ని దేశాల్లో ఇప్పటికే మాంద్యం ప్రభావం కనిపిస్తున్నది. ఆర్థిక మాంద్యం తీవ్రమైతే దాని ప్రభావం భారత్ పై కనిపించే అవకాశం ఉంది.
భారత్ నుంచి స్మార్ట్ ఫోన్లు, తొళ్ల వస్తువులు, కెమికల్, లైట్ ఇంజనీరింగ్ వస్తువులు, దుస్తులు వంటివి ఎక్కువగా ఎగుమతి అవుతుంటాయి. జర్మనీ భారత్‌కు తొమ్మిదో పెద్ద పెట్టుబడిదారు. పెట్టుబడులపై కొంత ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నా, మాంద్యం సమయంలో తక్కువ ధరలకు దొరికే వస్తువుల కోసం ఆ దేశాలు చూస్తాయని, ప్రత్యామ్నాయంగా వాటికి భారత్ కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి 10.3 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి. వీనిపై ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఎగుమతుల్లో కోతలు పడే అవకాశాలు ఉన్నాయని, ఎగుమతిదారులు ప్రత్యామ్నాయాలను ఆలోచించాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. వ్యాపరపరంగా ఇబ్బందులు ఎదురైనా, మాంద్యం ప్రభావం దేశంపై పెద్దగా ఉండకపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.