Nepal President: నేపాల్ కొత్త అధ్యక్షుడిగా రామ్‌చంద్ర పౌడెల్ నియమాకం
Ram Chandra Paudel wins Nepal’s Presidential election
నేపాల్ కొత్త అధ్యక్షుడిగా నేపాలీ కాంగ్రెస్ పార్టీకి చెందిన రామ్‌చంద్ర పౌడెల్ నియమితులయ్యారు. నేపాల్ అధ్యక్షుడిని ఆ దేశ ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నుకుంటుంది.మార్చి 9న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన ఎనిమిది మంది అభ్యర్థులు పోటీపడ్డారు. నేపాల్ దేశంలో 7 ప్రావిన్స్ లకు చెందిన 550 మంది సభ్యులు, 332 మంది పార్లమెంట్ సభ్యులు మొత్తం 882 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. రామ్‌చంద్ర పౌడెల్‌కు 33,712 ఎలక్టోరల్ ఓట్లు దక్కగా, ఆయన ప్రధాన ప్రత్యర్థి సీపీఎన్- యూఎమ్‌ఎల్ పార్టీకి చెందిన సుభాష్ చంద్ర నెమ్‌వాంగ్‌కు 18,518 ఓట్లు దక్కాయి.
ప్రస్తుతం నేపాల్ అధ్యక్షురాలిగా ఉన్న బిద్యాదేవీ భండారీ పదవీ కాలం మార్చి 12తో ముగియనుంది. అప్పటి నుంచి రానున్న ఐదేళ్ల పాటు పౌడెల్ ఈ పదవిలో కొనసాగనున్నారు. ఏ అభ్యర్థి అయినా రెండుసార్లకు మించి అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయకూడదనే నిబంధన నేపాల్ దేశంలో అమల్లో ఉంది. 2008లో నేపాల్ రిపబ్లిక్ దేశంగా మారిన నాటి నుంచి ఇది మూడవ అధ్యక్ష ఎన్నిక కావడం విశేషం.
నేపాల్ కొత్త అధ్యక్షునిగా ఎన్నికైన రామచంద్ర పౌడెల్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నేపాల్ కాంగ్రెస్ చీఫ్ షేర్ బహదుర్ దుబే శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు కొత్త అధ్యక్షుడిని ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Ram Chandra Poudel elected as third president of #Nepal
Read more: https://t.co/g7XRDg9JDA@PBSC_Kathmandu pic.twitter.com/ZTcofyalnw
— DD News (@DDNewslive) March 9, 2023
Congratulations to Honorable @NcPaudel for being elected as the third President of Nepal. pic.twitter.com/fV8aFBt1yL
— Dr. Shankar P Sharma (@DrShankarSharma) March 9, 2023
Ramchandra Paudel WAS a Nepali Congress leader until yesterday
He is now ALL of Nepal's president. We expect him to set new standards as NONPARTISAN head of state
He has a BIG CHALLENGE in a fractious political landscape but also GREAT OPPORTUNITY
Keep an eye on HISTORY pleez! pic.twitter.com/Ukx1eosoGO
— Akhilesh Upadhyay (@akhileshU) March 10, 2023