Rahul gandhi: అమెరికా పర్యటనలో ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul gandhi). బుధవారం స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీని (Stanford University ) సందర్శించిన రాహుల్ గాంధీ.. అక్కడ తనపై ఎంపీగా అనర్హత వేటు (disqualification as MP) పడడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Rahul gandhi: అమెరికా పర్యటనలో ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul gandhi). బుధవారం స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీని (Stanford University ) సందర్శించిన రాహుల్ గాంధీ.. అక్కడ తనపై ఎంపీగా అనర్హత వేటు (disqualification as MP) పడడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పరువునష్టం కేసులో గరిష్ఠ శిక్షను ఎదుర్కొంటున్న మొదటి వ్యక్తిని తానే కావొచ్చని వ్యాఖ్యానించారు.
2004లో తాను రాజకీయాల్లోకి వచ్చానని అన్న రాహుల్ గాంధీ.. ఎప్పుడు ఇలాంటివి సాధ్యమవుతాయని ఊహించలేదన్నారు. పరువు నష్టం కేసులో ఇంతటి శిక్షను ప్రపంచంలో ఎవరూ అనుభవించి ఉండరు కావొచ్చని వెల్లడించారు. మొదటి వ్యక్తిని తానే కావొచ్చని చెప్పుకొచ్చారు. భారత్లో వ్యవస్థలన్నింటినీ బీజేపీ తన గుప్పిట్లోకి తీసుకుంటుందని మండిపడ్డారు. వ్యవస్థలేవీ తమకు సాయం చేయడం లేదని చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యం కోసం ప్రతిపక్షాలన్నీ పోరాడుతున్నాయని వెల్లడించారు. అందుకోసమే భారత్ జోడో యాత్రను చేపట్టామని రాహుల్ గాంధీ వెల్లడించారు.
ఆ తర్వాత ఓ స్టార్టప్ కంపెనీ వ్యవస్థాపకులతో రాహుల్ సమావేశమయ్యారు. ఈక్రమంలో తన ఐఫోన్ తీసి చెవి దగ్గర పెట్టుకొని హలో మోడీ అని అన్నారు. పరోక్షంగా తాను ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నానో మోడీ వింటున్నారని చెప్పుకొచ్చారు. తన ఫోన్ను ట్యాప్ చేశారని ఆరోపించారు. డేటా రక్షణ, భద్రతపై సరైన నిబంధనలు ఉండాల్సిన అవసరం ఎంతో ఉందని రాహుల్ గాంధీ వెల్లడించారు.