క్షిపణిని ఉపయోగించి విమానాన్ని కూల్చేశారని.. అందుకే ప్రిగోజిన్ చనిపోయారని రష్యా (Russia) వాదిస్తోంది. కానీ అమెరికా (America) మాత్రం రష్యా వాదనను కట్టిపారేసింది. యెవ్‌గనీ ప్రిగోజిన్‌ను కచ్చితంగా హత్య చేశారని అమెరికా ఇంటెలిజెన్స్ అంచనా వేసింది.
America: రష్యా కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ (Wagner Group chief Yevgeny Prigozhin) మరణించిన విషయం తెలిసిందే. ఆగష్టు 23న ప్రిగోజిన్ ఓ విమానంలో ప్రయాణిస్తుండగా.. ఫ్లైట్ కుప్పకూలిపోయి ఆయన ప్రాణాలు కోల్పోయాడు. మాస్కో నుంచి సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే క్షిపణిని ఉపయోగించి విమానాన్ని కూల్చేశారని.. అందుకే ప్రిగోజిన్ చనిపోయారని రష్యా (Russia) వాదిస్తోంది. కానీ అమెరికా (America) మాత్రం రష్యా వాదనను కట్టిపారేసింది. యెవ్‌గనీ ప్రిగోజిన్‌ను కచ్చితంగా హత్య చేశారని అమెరికా ఇంటెలిజెన్స్ అంచనా వేసింది.
విమానం కూలిపోవడానికంటే ముందే.. అందులో భారీ పేలుడు సంభవించి ఉంటుందని అమెరికా వెల్లడించింది. ఆ పేలుడు వల్లే ప్రిగోజిన్ మరణించి ఉంటారని పేర్కొంది. అటు రష్యా వాదనను వాగ్నర్ గ్రూప్‌కు చెందిన గ్రేజోన్ టెలిగ్రామ్ ఛానల్ కూడా కొట్టిపారేసింది. కచ్చితంగా ప్రిగోజిన్‌ది హత్యేనని తేల్చి చెబుతోంది. కావాలనే ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని గ్రేజోన్ టెలిగ్రామ్ ఛానల్ ఆరోపించింది.
అయితే ఈ ప్రమాదంలో ప్రిగోజిన్‌తో పాటు..వాగ్నర్ లాజిస్టిక్స్ విభాగం అధిపతి, దిమిత్ర ఉత్కిన్, వాగ్నర్ గ్రూప్‌కు చెందిన ఓ కీలక సభ్యుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే వాగ్నర్ గ్రూప్ కీలక నేతలంతా ఒకేసారి ఎందుకు ఒకే విమానంలో ఎందుకు సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు బయల్దేరారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.