జీ 7 సదస్సులో పాల్గొనేందుకు జపాన్ వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ అగ్రదేశాలకు చెందిన అధినేతలతో సమావేశం అయ్యారు. అనేక కీలక అంశాలపై వారితో చర్చలు జరిపారు. చర్చల అనంతరం హిరోషిమాలోని శాంతి పార్కును సందర్శించారు. అమరులకు నివాళులు అర్పించారు
PM Narendra Modi in Hiroshima Peace Park
జీ 7 సదస్సులో పాల్గొనేందుకు జపాన్ వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ అగ్రదేశాలకు చెందిన అధినేతలతో సమావేశం అయ్యారు. అనేక కీలక అంశాలపై వారితో చర్చలు జరిపారు. చర్చల అనంతరం హిరోషిమాలోని శాంతి పార్కును సందర్శించారు. అమరులకు నివాళులు అర్పించారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జరిగిన న్యూక్లియర్ దాడిలో మరణించిన వారి జ్ఞాపకార్ధం ఏర్పాటు చేసిన ఈ పార్కును సందర్శించిన ప్రధాని మోడీ అక్కడ కొంత సమయం గడిపారు. శాంతి పార్కు ప్రత్యేకతలను స్వయంగా తిలకించారు.
ప్రధాని నరేంద్రమోడీతో పాటు జీ7 సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఇతర దేశాల నేతలు కూడా హిరోషిమా శాంతి వనాన్ని దర్శించుకున్నారు. ప్రధాని కార్యాలయం ఈ విషయాన్ని వెల్లడిస్తూ ట్వీట్ చేసింది.
జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా, కిషిదా భార్య సదస్సు వచ్చిన నాయకులను పీస్ మెమోరియల్ పార్క్ వద్ద స్వాగతం పలికారు. 1945 ఆగస్టు 6న జరిగిన అణుబాంబు దాడిని వివరించే వీడియోలను వీక్షించారు.
1945లో అమెరికా అణుబాంబు ప్రయోగించడంతో జపాన్ దేశంలోని హిరోషిమా నగరం ధ్వంసం అయింది. దాదాపు లక్షా 29 వేల మంది మరణించారు. నగరం మొత్తం ధ్వంసం అయింది. ఒకే ఒక నిర్మాణం చెక్కుచెదరకుండా నిలిచింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలోనే హిరోషిమా శాంతి వనం ఏర్పాటు చేశారు.