PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) జీ-7 సదస్సులో (G-7 summit) పాల్గొనడం కోసం శుక్రవారం జపాన్‌కి వెళ్లిన విషయం తెలిసిందే. ఈక్రమంలో హిరోషిమాలోని (Hiroshima) మొటొయాసు నది సమీపంలో.. శాంతివనం దగ్గర్లో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ (Mahatma Gandhi) విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించారు.
PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) జీ-7 సదస్సులో (G-7 summit) పాల్గొనడం కోసం శుక్రవారం జపాన్‌కి వెళ్లిన విషయం తెలిసిందే. ఈక్రమంలో హిరోషిమాలోని (Hiroshima) మొటొయాసు నది సమీపంలో.. శాంతివనం దగ్గర్లో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ (Mahatma Gandhi) విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించారు. అనంతరం మహాత్ముడి విగ్రహం వద్ద పూలు ఉంచి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ ఇప్పటికీ కూడా హిరోషిమా పేరు చెబితే ప్రపంచం వణికిపోతుందని వెల్లడించారు. అమెరికా చేసిన అణుదాడిలో వేలాది మంది చనిపోయారని తెలిపారు. జీ-7 సదస్సు కోసం వచ్చిన తనకు మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం ఇచ్చిన జపాన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. హిరోషిమాలో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మహాత్ముడి సిద్ధాంతమైన అహింసను ముందుకు తీసుకెళ్తుందని చెప్పుకొచ్చారు. గాంధీ సిద్ధాంతాలను అనుసరించడం ద్వారా ఉగ్రవాదం వంటి సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని మోడీ పేర్కొన్నారు.
అలాగే గతంలో జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా భారత్‌కు వచ్చినప్పుడు మోడీ బోధి వృక్షాన్ని బహుమతిగా అందజేశారు. దానిని గాంధీ విగ్రహానికి సమీపంలో శాంతివనంలో నాటారు. ఈ విషయాన్ని అక్కడి అధికారులు మోడీకి తెలపడంతో సంతోషం వ్యక్తం చేశారు.