Modi: విదేశీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi). జీ-7 సమ్మిట్ (G-7 Summit) కోసం జపాన్ వెళ్లిన మోడీ.. అక్కడి నుంచి పాపువా న్యూ గినియా (Papua New Guinea) దేశం వెళ్లారు.
Modi: విదేశీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi). జీ-7 సమ్మిట్ (G-7 Summit) కోసం జపాన్ వెళ్లిన మోడీ.. అక్కడి నుంచి పాపువా న్యూ గినియా (Papua New Guinea) దేశం వెళ్లారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా (australia) పర్యటనకు వెళ్లారు. అక్కడే స్థిరపడి పోయిన భారతీయులతో మోడీ సిడ్నీ నగరంలో సమావేశమయ్యారు. వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద టాలెంట్ ఫ్యాక్టరీ భారత్లో ఉందని మోడీ వ్యాఖ్యానించారు.
భారత్ ఆస్ట్రేలియాల మధ్య ఉన్న అనుబంధం చారిత్రకమైనదని మోడీ అన్నారు. రెండు దేశా మధ్య ఉన్న బంధాన్ని 3Cలు ప్రభావితం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. 3Cలు అంటే క్రికెట్, కామన్వెల్త్, కర్రీ అని వెల్లడించారు. అయితే కొన్ని తరాలుగా క్రికెట్ భారత్, ఆస్ట్రేలియా దేశాలను కలిపి ఉంచిందని.. ఇప్పుడు సినిమా, టెన్నిస్, యోగాలు బంధాన్ని బలోపేతం చేస్తున్నాయని మోడీ అన్నారు. రెండు దేశాల మధ్య బంధం బలపడడానికి కారణం.. గౌరవం, పరస్పర నమ్మకం, విశాల హృదయం అని మోడీ పేర్కొన్నారు. గతంలో ఆస్ట్రేలియా వచ్చినప్పుడు మళ్లీ వస్తానని ప్రవాస భారతీయులకు మాట ఇచ్చానని.. ఇప్పుడు తిరిగొచ్చి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని మోడీ తెలిపారు.
అనంతరం రెండు దేశాల ప్రధానులు కలిసి సిడ్నీలోని హారిస్ పార్క్లో నిర్మిస్తున్న లిటిల్ ఇండియా గేట్వేకు శంకుస్థాపన చేశారు. ఇరు దేశాల మధ్య బంధం, ప్రవాస భారతీయులు అందిస్తున్న సహకారానికి గుర్తుగా ఈ గేట్వేను నిర్మిస్తున్నారు.
మరోవైపు ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించారు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్. భారత ప్రధాని మోడీ ఎక్కడికి వెళ్లినా అనూహ్య స్పందన వస్తోందని వ్యాఖ్యానించారు. అలాగే మోడీని అమెరికన్ సింగర్ బ్రూస్ స్ప్రింగ్స్టీన్తో పోల్చారు. మోడీకి లభిస్తోన్న ఆదరణను చూసి ఆశ్చర్యపోయిన అల్బనీస్ ‘మోడీ ఈజ్ ది బాస్’ అని వ్యాఖ్యానించారు.
A very special evening in Sydney, made even more special by the august presence of PM @AlboMP.
Gratitude to the Indian community which came in record numbers. pic.twitter.com/vnKAo1cYdO
— Narendra Modi (@narendramodi) May 23, 2023