Modi: విదేశీ పర్యటలో బిజీబిజీగా ఉన్నారు ప్రధాని మోడీ(PM Modi). జపాన్ (Japan) పర్యటన ముగిసిన వెంటనే పాపువా న్యూ గినియా (Papua New Guinea) పర్యటనకు వెళ్లారు.
Modi: విదేశీ పర్యటలో బిజీబిజీగా ఉన్నారు ప్రధాని మోడీ(PM Modi). జపాన్ (Japan) పర్యటన ముగిసిన వెంటనే పాపువా న్యూ గినియా (Papua New Guinea) పర్యటనకు వెళ్లారు. సోమవారం ఉదయం ఆదేశ అగ్రనేతలతో సమావేశమై.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఈ సందర్భంగా మోడీకి అరుదైన గౌరవం దక్కింది. రెండు దేశాలు అత్యున్నత పురస్కారాలతో ప్రధాని మోడీని సత్కరించాయి.
మోడీ ప్రపంచ నాయకత్వాన్ని గుర్తించి ఫిజీ-కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ-అత్యున్నత గౌరవాన్ని ఫిజీ ప్రధాని సితివేణి రబుకా ప్రదానం చేశారు. ఫిజియేతర వ్యక్తులు అతి కొద్ది మంది మాత్రమే ఈ అవార్డును అందుకున్నారు. అందులో ప్రధాని మోడీ ఒకరు. ఆ తర్వాత పపువా న్యూ గినియా అగ్రనేతలు కూడా అత్యున్నత పురస్కారంతో మోడీని సత్కరించారు. ఈ సందర్భంగా ఫిజీ, భారత్ మధ్య సంబంధాలు మరింత పటిష్టం చేసేందుకు కలిసి పనిచేస్తామని మోడీ పేర్కొన్నారు.
ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రధాన మంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. ‘‘ఫిజీ పౌర పురస్కారం మన ప్రధానికి దక్కడం భారతదేశానికి పెద్ద గౌరవం. మోడీ ప్రపంచ నాయకత్వానికి గుర్తింపుగా ఫిజియేతరులు కొద్దిమంది మాత్రమే ఈ అవార్డును అందుకున్నారు’’ అంటూ రాసుకొచ్చింది.