Brazial Violence: బ్రెజిల్‌లో నిరసనకారుల విధ్వంసం, విచారణ వ్యక్తం చేసిన ప్రధాని మోడీ
PM Modi expressed concern over the Violence in Brazil
బ్రెజిల్‌లో మాజీ అధ్యక్షుడు జైరో బోల్సోనారో మద్దతుదారులు రెచ్చిపోయారు. పలు చోట్ల వీరంగం సృష్టించారు. విధ్వంసానికి పాల్పడ్డారు. రాజధాని నగరం బ్రెసీలియాలోని నేషనల్ కాంగ్రెస్, సుప్రీంకోర్టు, అధ్యక్షుడి ప్యాలెస్ భవనాలపై దాడిచేశారు. ఆకుపచ్చ, పసుపు దుస్తులు ధరించి రోడ్లపైకి వచ్చిన వందలాది మంది నిరసనకారులు బ్రెజిల్ అత్యున్నత పరిపాలన భవనాల్లోకి చొచ్చుకెళ్లారు. విచక్షణారహితంగా ప్రవర్తించారు. అధ్యక్షుడు లూలా డిసిల్వాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బ్రెజిల్‌లో జరుగుతున్న ఆందోళనలపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ప్రజాస్వామ్య విలువలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఆకాంక్షించారు. బ్రెసీలియాలో జరుగుతున్న ఆందోళన, విధ్వంసం గురించి తెలిసి చాలా బాధపడుతున్నానని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఇటువంటి విపత్కర సమయంలో బ్రెజిల్ ప్రభుత్వానికి అండగా నిలుస్తామని ప్రధాని ట్వీట్ చేశారు.
Deeply concerned about the news of rioting and vandalism against the State institutions in Brasilia. Democratic traditions must be respected by everyone. We extend our full support to the Brazilian authorities. @LulaOficial
— Narendra Modi (@narendramodi) January 9, 2023
ఇటీవలే ముగిసిన బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో బోల్సోనారో ఓటమి చెందారు. లూలా డిసిల్వా అధ్యక్షుడిగా ఎన్నికలయ్యారు. అప్పటి నుంచి బ్రెజిల్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం తీవ్ర రూపం దాల్చింది. బోల్సోనారో మద్దతుదారులు వీరంగం చేస్తున్నారు. విధ్వంసాలకు పాల్పడుతున్నారు. విచక్షణా రహితంగా ప్రవర్థిస్తున్నారు.