Noble Peace Prize: నోబెల్ శాంతి బహుమతికి నరేంద్ర మోడీ అన్ని విధాలా అర్హుడు – ఆస్లే టోజే
PM Modi, biggest contender for Noble Peace Prize
ప్రధాని నరేంద్ర మోడీపై నోబెల్ కమిటీ డిప్యూటీ లీడర్ ఆస్లే టోజే ప్రశంసల వర్షం కురిపించారు. నోబెల్ శాంతి బహుమతి పొందేందకు ప్రధాని మోడీ అన్ని విధాలా అర్హుడు అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం భారతదేశంలో పర్యటిస్తున్న టోజే ఓ ప్రముఖ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలు వెల్లడించారు.
భారతదేశం సూపర్ పవర్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మోడీ వంటి శక్తి వంతమైన నాయకులు ప్రపంచ వ్యాప్తంగా శాంతి నెలకొల్పేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారని టోజే అన్నారు. న్యూక్లియర్ వెపన్స్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలు రష్యాకు తెలియజేయడం ఎంతో ఉపయుక్తంగా నిలిచిందని టోజే తెలిపారు. భారతదేశం తన ఉద్దేశ్యాన్ని ఎంతో నేర్పుగా తెలియజేసిందని, ఎవరినీ భయపెట్టలేదని, ఎంతో స్నేహపూర్వకంగానే తన అభిప్రాయాలను తెలియజేసిందని, అంతర్జాతీయ రాజకీయాల్లో ఇటువంటి విధానమే శ్రేయస్కరమని టోజే తెలిపారు.
భారత ఆర్ధిక వ్యవస్థను ఒకవైపు అభివృద్ధి పథంవైపు నడిపిస్తునే…ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న అనేక కీలక పరిణామాల్లో భాగస్వామ్యం అవుతున్నారని టోజే గుర్తుచేశారు.
ఆస్టే టోజే నార్వేకు చెందిన ఫారెన్ పాలసీ ఎనలిస్టు. హార్వార్డ్ యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉన్నారు. ఆయన వెలువరించిన అనేక అభిప్రాయాలకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉంది. అటువంటి వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించడం, మోడీ నోబెల్ బహుమతికి అర్హుడని తెలిపడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.