Nepal Plane Crash: నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం,16 మంది మృతి
Plane with 72 Passengers Crashes in Nepal
నేపాల్ లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఖాట్మండ్ నుంచి పొకారా వెళుతుండగా ల్యాండింగ్ సమయంలో విమానం క్రాష్ అయింది. విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ఎతి ఎయిర్ లైన్స్ సంస్థ అధికార ప్రతినిధి ప్రయాణికుల వివరాలను తెలిపారు.ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు రంగంలో దిగాయి. వీలైనంత మందిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
నేపాల్ లోని పొకారా అంతర్జాతీయ విమానాశ్రయం రన్ వే పైనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగిన ప్రదేశంలో దట్టమైన పొగలు అలముకున్నాయి. సహాయక సిబ్బందితో పాటు పలువురు స్థానికులు కూడా ప్రమాద స్థలానికి చేరుకున్నారు. చేతనైన సాయం చేస్తున్నారు.
ప్రమాదం జరిగిన విమానంలో ఇద్దరు పైలెట్లు, ఇద్దరు ఎయిర్ హోస్టెస్ లు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 68 మంది ప్రయాణికుల్లో 10 మంది విదేశీ ప్రయాణికులు ఉన్నట్లు కూడా తెలుస్తోంది.
Plane crash in #Nepal: A Yeti Air ATR72 aircraft flying to Pokhara from #Kathmandu has crashed, Aircraft had 68 passengers. pic.twitter.com/6MLBbDUPeE
— Sandeep Panwar (@tweet_sandeep) January 15, 2023
Atleast 30 Dead in #Nepal #planecrash in Pokhra, death toll may rise. pic.twitter.com/GnqXtM1JJP
— Sandeep Panwar (@tweet_sandeep) January 15, 2023
Yeti Airlines crashes at Pokhara. A recurring incident in aviation safety raises question again in Nepal skies! Rest in peace to the departed souls. 💐 #yetiairlines #pokhara #rip pic.twitter.com/b2p38yr3qW
— Paras Shrestha (@Paras156) January 15, 2023
Horrible news coming in.
🚨 A #Yeti Airlines flight has crashed in between #Kathmandu and #Pokhara in #Nepal.
🚨 The flight had 68 passengers + 4 crew members on board.
🚨 Rescue ops on. pic.twitter.com/HIjSozARdK— Ananya Bhattacharya (@ananya116) January 15, 2023