Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్‌ను (Imran Khan) అరెస్ట్ చేయడంతో పెద్ద ఎత్తున హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇస్లామాబాద్‌లోని కోర్టుకు హాజరైన ఇమ్రాన్‌ను పాక్ రేంజర్లు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పాక్ సుప్రీంకోర్టు ఆయన అరెస్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఒకరోజు తర్వాత విడుదల చేశారు.
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్‌ను (Imran Khan) అరెస్ట్ చేయడంతో పెద్ద ఎత్తున హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇస్లామాబాద్‌లోని కోర్టుకు హాజరైన ఇమ్రాన్‌ను పాక్ రేంజర్లు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పాక్ సుప్రీంకోర్టు ఆయన అరెస్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఒకరోజు తర్వాత విడుదల చేశారు. ఈక్రమంలో ఇమ్రాన్ ఖాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాక్ అవినీతి నిరోధశాఖ, ఆర్మీకి చెందిన రేంజర్లపై కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తన మద్ధతు దారులపై రేంజర్లు కాల్పులు జరిపారని మండిపడ్డారు ఇమ్రాన్ ఖాన్. తన అరెస్ట్ తర్వాత చెలరేగిన హింసలో 8 మంది మృతి చెందగా.. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. ఈక్రమంలో ఆందోళన చేస్తున్న వారిపై కాల్పులు జరిపిన రేంజర్లపై హత్యానేరం కింద కేసు పెట్టాలని నిర్ణయించినట్లు ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. ఆ పిటిషన్లో పాక్ అంతర్గత మంత్రి రాణా సనావుల్లా, పంజాబ్, ఖైబర్ పంఖ్తుంక్వా ప్రావిన్సుల తాతాల్కిక ముఖ్యమంత్రులు, పోలీస్ ఐజీలతో పాటు సీనియర్ అధికారుల పేర్లను చేర్చాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
అంతకముందు ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యం ఇబ్బందుల్లో ఉందని పేర్కొన్నారు. దేశానికి న్యాయవ్యవస్థ ఆశాజనకంగా ఉందని వెల్లడించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోతామని ప్రస్తుత ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు.