Pakistan PM on India: గుణపాఠం నేర్చుకున్నాం…భారత్ తో చర్చలకు సిద్ధం
Pakistan PM on India: పాకిస్తాన్ లో నేడు ఆర్థిక, ఆహార సంక్షోభం తీవ్రస్థాయిలో ఉన్నది. రోజువారి అవసరాలకు ఉపయోగపడే గోధుమలకు తీవ్రస్థాయిలో కరువు ఏర్పడింది. దీంతో ప్రజలు తిండి దొరక్క అల్లాడుతున్నారు. ఆహరం ధాన్యాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. లూఠీలు చేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ రోజురోజుకు దిగజారిపోతుండటంతో ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది. పొరుగుదేశం భారత్‌తో వైరం పెంచుకోవడం వలనే ఈ దుస్థితి ఏర్పడినట్లు ఆ దేశ ప్రధాని షరీఫ్ అంగీకరించారు. మూడు యుద్ధాల తరువాత తాము గుణపాఠం నేర్చుకున్నామని, తాము భారత్‌తో శాంతిని కోరుకుంటున్నామని అన్నారు.
కాశ్మీర్‌తో సహా అన్ని అంశాలపై కూర్చోని మాట్లాడుకునేందుకు తాము సదా సిద్ధంగా ఉన్నామని, తమకు ఇప్పుడు భారత్ ఎంతో ముఖ్యమని, భారత్ తమ విషయంలో భారత్ చొరవ చూపిస్తేనే ప్రస్తుత పరిస్థితుల నుండి బయటపడగలమని పాకిస్తాన్ పీఎం షరీఫ్ పేర్కొన్నారు. భారత్‌తో చర్చలు జరిపే విధంగా సాయం చేయాలని ఆయన యూఏఈని అభ్యర్ధించారు. యూఏఈ భారత్ మధ్య మంచి సంబంధాలు ఉండటంతో మధ్యవర్తిత్వం చేసి భారత ప్రధానిని ఒప్పించేలా చేయాలని షరీఫ్ కోరినట్లు తెలుస్తోంది. మరి భారత ప్రధాని మోడీ ఈ అభ్యర్థనను అంగీకరిస్తారా? ఒకవేళ ప్రస్తుత పరిస్థుతుల నుండి పాక్‌ను భారత్ గట్టెక్కిస్తే, ఆ తరువాత కూడా భారత్‌తో స్నేహాన్ని కొనసాగిస్తారా లేదంటే ఎప్పటిలాగే కాలుదువ్వుతారా అన్నది చూడాలి.