Imran Khan: దయాది దేశం పాకిస్థాన్‌లో (Pakistan) కొద్దిరోజులుగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఆ దేశ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్‌ను (Imran Khan) జైలుపాలు చేసేందుకు విస్తృతంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Imran Khan: దాయాది దేశం పాకిస్థాన్‌లో (Pakistan) కొద్దిరోజులుగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఆ దేశ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్‌ను (Imran Khan) జైలుపాలు చేసేందుకు విస్తృతంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఓసారి అరెస్ట్ చేయగా.. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో వదిలేశారు. ఈక్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిత్యం అమెరికాపై (America) కాలుదువ్వే ఇమ్రాన్ ఖాన్ ఆ దేశం సాయం కోరారు. తనను జైల్లో పెడుతారనే భయంతో అమెరికా ప్రతినిధుల సభ సభ్యురాలని ఇమ్రాన్ సాయం అడిగారు.
అమెరికాలో ప్రతినిధుల సభలో కాలిఫోర్నియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మాక్సినె మూర్ వాటర్స్‌తో ఇమ్రాన్ ఖాన్ ఫోన్లో మాట్లాడి సాయం అడిగారు. పాకిస్థాన్‌లో జరుగుతున్న విధ్వంసం.. మానవ హక్కుల ఉల్లంఘన, ప్రస్తుత పరిస్థితి గురించి ఆమెకు వివరించారు. అమెరికా చట్ట సభలో దీనిపై చర్చించాలని, తనకు అనుకూలంగా ప్రకటన విడుదల చేయాలని ఇమ్రాన్ ఖాన్, మాక్సినె మూర్‌ను కోరారు. ఇందుకు సంబంధించిన ఓ ఆడియో బయటకొచ్చింది. ప్రస్తుతం ఆ ఆడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఇకపోతే ఇటీవల పాకిస్థాన్ రేంజర్లు ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇస్లామాబాద్‌లోని ఓ కోర్టుకు హాజరైన ఇమ్రాన్ ఖాన్‌ను నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేసి రహస్య ప్రదేశానికి తరలించారు. దీంతో పాకిస్తాన్ ఒక్కసారిగా అట్టుడికింది. ఇమ్రాన్ మద్ధతుదారులు పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించారు. ఆ తర్వాత స్పందించిన పాక్ సుప్రీంకోర్టు.. ఇమ్రాన్ అరెస్ట్‌ను ఖండించింది. వెంటనే ఆయన్ను విడుద చేయాలని ఆదేశించింది. దీంతో ఇమ్రాన్ ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేశారు.