Pakistan EX PM Imrankhan Arrest: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్
Pakistan EX PM Imrankhan Arrest: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ఇస్లామాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. తోషాఖానా కేసులో ఆయన్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో ఆయనపై సుమారు 80 కి పైగా కేసులు ఉన్నాయి. వివిధ కోర్టుల్లో ఈ కేసులు ఉండటంతో అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ సమయంలో ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తనను చంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందులో భాగంగానే కేసులు, అరెస్టులు చేస్తున్నారని వీడియో రూపంలో ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
గత కొంతకాలంగా ఇమ్రాన్‌ను అరెస్ట్ చేసేందుకు పాక్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. లాహోర్‌లోని ఆయన నివాసం వద్ద పగడ్బంధీగా ఏర్పాట్లుచేసి అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఒక కార్యకర్త మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. తనను చంపేందుకు ప్రభత్వం ప్రయత్నిస్తోందని, తాను ఉన్నా లేకున్నా దేశాభివృద్ధికి కుట్రలు పన్నుతున్న ప్రధాని షెహబాజ్ షరీఫ్ పై పోరాటం ఆపవద్దని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు.