ప్రస్తుతం పాకిస్తాన్ రాజకీయంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఒకవైపు ఆహారం, ఆర్థికంగా సంక్షోభాలు ఎదుర్కొంటున్న పాక్ ప్రభుత్వానికి రాజకీయ సంక్షోభంతో మరింత దిగజారిపోయింది. పీటీఐ సంకీర్ణ ప్రభుత్వాన్ని గద్దెదించి అధికారంలోకి వచ్చిన షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఇమ్రాన్‌ఖాన్‌పై కక్షకట్టి పగతీర్చుకుంటున్నది.
Pakistan Political Crisis: ప్రస్తుతం పాకిస్తాన్ రాజకీయంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఒకవైపు ఆహారం, ఆర్థికంగా సంక్షోభాలు ఎదుర్కొంటున్న పాక్ ప్రభుత్వానికి రాజకీయ సంక్షోభంతో మరింత దిగజారిపోయింది. పీటీఐ సంకీర్ణ ప్రభుత్వాన్ని గద్దెదించి అధికారంలోకి వచ్చిన షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఇమ్రాన్‌ఖాన్‌పై కక్షకట్టి పగతీర్చుకుంటున్నది. ఇమ్రాన్ ఖాన్‌పై ఇప్పటికే అనేక కేసులు బనాయించారు. ప్రభుత్వం, సైన్యం కలిసి తనను చంపాలని చూస్తున్నాయని, తనను పదేళ్లపాటు జైలుకు పంపాలని చూస్తున్నాయని ఇమ్రాన్‌ఖాన్ ఇప్పటికే పలుమార్లు మీడియా ముందు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే అనేక కేసుల్లో ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్ ఇచ్చారు. ఇటీవలే ఇస్లామాబాద్‌కు వచ్చిన ఇమ్రాన్ ఖాన్‌ను రేంజర్లు అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా దేశం భగ్గుమన్నది. పీటీఐ కార్యకర్తలు, నేతలు రోడ్లపైకి వచ్చి విధ్వంసం సృష్టించారు. దీంతో సైన్యం వారిపై ఉక్కుపాదం మోపుతున్నది.
ఇక, దేశంలో విధ్వంసం సృష్టిస్తున్నారని పీటీఐ నేతలు, మాజీ మంత్రులపై కేసులు బనాయించింది ప్రభుత్వం. సైన్యం, పోలీసులకు వీరు ఎక్కడ కనిపిస్తే అక్కడ అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా పాక్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరీ ఓ కేసులో ఇస్లామాబాద్ హైకోర్టుకు హాజరయ్యారు. ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనంతరం కోర్టు బయటకు వచ్చి కారులో కూర్చొగా, ఎదురుగా పోలీసులు కనిపించడంతో కారులో నుంచి కిందకు దూకి పరుగుపరుగున కోర్టులోపలికి వెళ్లారు. మరో కేసులో పోలీసులు తనను అరెస్ట్ చేయాలని చూస్తున్నారని జడ్జి ముందు పేర్కొన్నారు. మరో పిటిషన్ దాఖలు చేయాలని జడ్జి ఆదేశించారు. పిటిషన్ దాఖలు చేసే వరకు ఆయన కోర్టులోపనే ఉండటం విశేషం. పాపం మంత్రులకు ఇప్పుడు కోర్టులే రక్షగా మారుతున్నాయి. కోర్టు గేటుదాటి బయటకు రావాలంటే వణికిపోతున్నారు.
Hahahaha! “Takkar Ke Log”. Fawad Chaudhry RAN back to the high court after looking at the police. The so-called warriors of “Haqeeqi Azadi”! 😂 Zardari was right when he said, “Imran Ka Zawaal Shuru”. Tank ke agay laitna nahi tha?pic.twitter.com/92HI7zMxYj
— Saad Kaiser 🇵🇰 (@TheSaadKaiser) May 16, 2023