Oscar Shock to Ukraine President: జెలెన్‌స్కీ ప్రపంగానికి ఆస్కార్ నో
Oscar Shock to Ukraine President:ఈనెల 12వ తేదీన ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరగనున్నది. ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఫైనల్ లిస్ట్‌కు చేరిన చిత్రాల నటీనటులు, దర్శక నిర్మాతలు అందరూ హాజరుకానున్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల నుండి ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ అవార్డుల వేడుక న్యూయార్క్ నగరంలో జరగనున్నది. ఈ నేపథ్యంలో ఈ వేదిక నుండి ప్రసంగించాలని అనేక మంది అనుకుంటారు. అదేవిధంగా ఈ వేదికపై వర్చువల్‌గా ప్రసంగించాలని అనుకున్న ఉక్రెయిన్ అధ్యక్షుడికి అస్కార్ అకాడమీ షాక్ ఇచ్చింది. అవార్డుల ప్రధానోత్సవ సమయంలో వర్చువల్‌గా ప్రసంగించే అవకాశం కల్పించాలని అభ్యర్ధించిన ఆయన అభ్యర్థనను అకాడమీ తిరస్కరించింది.
కేవలం ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం కావడంతో ఎలాంటి రాజకీయాలకు తావుండదని, రాజకీయాలకు సంబంధించిన అంశాల ప్రస్తావన అస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో ఉండకూడదని అకాడమీ నిర్ణయించింది. ఏడాది కాలంగా ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ప్రపంచం మద్దతు కూడగట్టేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వివిధ దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. అమెరికా, బ్రిటన్, ఈయు పార్లమెంట్ లో వర్చువల్‌గా మాట్లాడారు. రష్యాకు వ్యతిరేకంగా ప్రసంగిస్తూ మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ నుండే జెలెన్‌స్కీ రావడంతో, ఆస్కార్ వేదికను వినియోగించుకొని మద్దతు కూడగట్టాలని అనుకున్నా, అందుకు అకాడమీ అంగీకరించకపోవడం విశేషం.