Opinion polls: రిషి సునాక్ కే బ్రిటీషర్ల మద్దతు..ఒపీనియన్ పోల్స్ లో వెల్లడి
UK Opinion polls: బ్రిటన్ ప్రధాని పదవి కోసం అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎన్నికలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పార్టీ ఇప్పటి వరకు రెండు దశల ఎన్నికలు నిర్వహించగా రెండు దశాల్లోనూ రిషి సునాక్ ముందంజలో నిలిచారు. ఇక ఇదిలా ఉంటె, బ్రిటన్ మీడియా ఒపీనియన్ పోల్స్ ను నిర్వహించింది. ఈ ఒపీనియన్ పోల్స్ సైతం రిషి సునాక్ వైపే బ్రిటీషర్ల మొగ్గు చూపుతున్నారని తేలింది. రిషి సునాక్ కు 48 శాతం మద్దతు తెలపగా, లిజ్ ట్రూజ్ 39శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు, వాణిజ్యశాఖ మంత్రి పెన్నీ మార్డాంట్‌కు 33 శాతం మంది బ్రిటీషర్లు మద్దతు తెలిపినట్లు బ్రిటన్ మీడియా వెల్లడించింది.
బ్రిటన్ మీడియా నిర్వహించిన ఒపీనియన్ పోల్ సర్వేలో 4400 మంది రిషి కి మద్దతు తెలిపారు. అయితే, ప్రస్తుతం తాత్కాలిక ప్రధానిగా కొనసాగుతున్న బోరిస్ జాన్సన్ రిషి సునాక్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. రిషి సునాక్ ను కాకుండా ఇంకెవరినైనా ఎన్నుకోవాలని బోరిస్ జాన్సన్ తన అనుచర ఎంపీలకు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ట్రెండ్స్ అన్ని రిషి సునాక్ వైపు మొగ్గు చూపుతుండటంతో ఆయనే బ్రిటన్ కు కాబోయే ప్రధాని అని ఓ వర్గానికి చెందిన వ్యక్తులు ప్రచారం చేస్తున్నారు. అన్‌పాపులర్ విభాగంలో పోటీలో ఉన్న అభ్యర్థులందరికీ ప్రతికూలంగా ఉండగా మొత్తంగా రిషి సునాక్ అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా కొనసాగుతున్నారు’ అని జేఎల్ పార్ట్నర్స్ సహవ్యవస్థాపకుడు జేమ్స్ జాన్సన్ వెల్లడించారు.