H-1B visa: హెచ్1-బీ వీసాదారులకు అగ్రరాజ్యం గుడ్ న్యూస్
H-1B visa: అమెరికాలో హెచ్1బీ వీసాలపై వెళ్లి ఉద్యోగాలు కోల్పోయిన వారికి భారీ ఊరట లభించింది. ఈ వీసాలపై ఉద్యోగం కోల్పోయిన వారు 60 రోజుల్లోగా కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి లేదా తిరిగి తమ దేశానికి వెళాల్సి ఉంటుంది. తాజాగా అమెరికా ప్రభుత్వం ఈ గ్రేస్ పీరియడ్‌ను 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచింది. హెచ్1-బీ వీసాపై అమెరికాకు వచ్చినవారు తాము చేస్తున్న పనిని వదిలేసినా లేదా వారిని సంస్థ తొలగించినా కొత్త సంస్థలో అరవై రోజుల్లోగా చేరాలనే నియమం ఇప్పటివరకు ఉంది. కాగా దీనిని అమెరికా ప్రభుత్వం 180 రోజులకు పెంచినట్టు ఉత్తర్వులు జారీచేసింది. వలససేవల విభాగం, హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్టుమెంటులకు ఉపసంఘం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై ఉపసంఘంలో సభ్యుడు అజయ్ జైన్ భుటోరియా ప్రజంటేషన్ ఇచ్చారు.
హెచ్ 1బీ వీసాదార్లు 60 రోజుల్లో కొత్త ఉద్యోగం సంపాదించుకోవడం కష్టమని అజయ్ భుటోరియా చెప్పారు. అదీ కాకుండా హెచ్1బీ వీసా స్టాటస్ ట్రాన్స్‌ఫర్‌కు పెద్ద ఎత్తున పేపర్‌వర్క్ ఉంటుంది. ఈ లోగా 60 రోజుల గడువు తీరిపోతుంది. దానివల్ల చాలామంది బలవంతంగా తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లాల్సి వస్తున్నదని చెప్పారు. అందువల్ల ఇప్పుడిస్తున్న గ్రేస్ పీరియడ్‌కు అదనంగా మరో 120 రోజులు మంజూరు చేస్తూ అగ్రదేశం హెచ్ 1బీ వీసా పై వచ్చేవారికి ఈ గుడ్ న్యూస్ ను అందించింది.