North Korea test fires intercontinental ballistic missile: కొరియా ద్వీపంలో ఉద్రిక్తలు… వరసగా బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగాలు
North Korea test fires intercontinental ballistic missile: కొరియా ద్వీపంలో ఉద్రిక్త పరిస్థిలు నెలకొన్నాయి. ఉత్తర కొరియా వరసగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్నది. తాజాగా మరోమారు ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించడంతో మరింత ఉద్రిక్తత నెలకొన్నది. దక్షిణ కొరియా, జపాన్ అధ్యక్షులు సమావేశం కానున్న నేపథ్యంలో ఉత్తర కొరియా ఈ దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. మార్చి 14వ తేదీన రెండు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించగా, తాజాగా దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు.
ప్యాంగ్యాంగ్‌లోని సునాన్ ఏరియా నుండి దీనిని ప్రయోగించినట్లు సైన్యం గుర్తించింది. ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్ కావడంతో కొరియా ద్వీపంలో ఉద్రిక్తలు నెలకొన్నాయి. ఈ దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణి జపాన్ ఎకనామిక్ జోన్ అవతన పడే అవకాశం ఉండటంతో జపాన్ తమ నౌకాదళాన్ని అప్రమత్తం చేసింది. ఉత్తర కొరియా వరసగా ఈ ప్రయోగాలు చేపడుతుండటంతో దక్షిణ కొరియా, జపాన్ దేశాలు అప్రమత్తం అయ్యాయి. ఉత్తర కొరియా మరిన్ని ప్రయోగాలు చేపట్టే అవకాశం ఉందనే పక్కా సమాచారంతో దక్షిణ కొరియా సైన్యం సరిహద్దు వెంబడి నిఘాను పెంచింది. సైన్యాన్ని బలోపేతం చేసేందుకు సిద్దమౌతున్నది.