Nityananda hat for US States: నిత్యానందుడి మాయలో అమెరికా నగరాలు
Nityananda hat for US States: భారత దేశం నుండి పారిపోయి విదేశాల్లో దాక్కోని సొంతంగా ఓ దీవిని కొనుగోలు చేసి కైలాస పేరుతో దేశాన్ని ఏర్పాటు చేసుకున్న నిత్యానంద, సడెన్ ఇటీవలే ఐరాస కల్చరల్ సభకు తన ప్రతినిధులను పంపారు. తమ సుప్రీంలీడర్‌ను భారత్ వేధిస్తుందని విమర్శలు చేయించారు. అంతేకాదు, సాంస్కృతిక భాగస్వామ్యం పేరుతో జరిగిన కార్యక్రమంలో భాగంగా అమెరికాలోని 30 నగరాలతో ఒప్పందాలు చేసుకున్నారు. ఇదే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస పేరుతో దేశం ఉన్నదో లేదో కూడా చూసుకోకుండా అమెరికాకు చెందిన 30 నగరాలు ఆ దేశం ప్రతినిధులతో ఒప్పందాలు చేసుకున్నారు. జవనరి 12వ తేదీన నెవార్క్ నగరాన్ని సోదరి నగరంగా ఒప్పందాలు జరిగాయి. అమెరికాకు చెందిన రిచ్‌మండ్, వర్జీనియా, డైటన్, ఒహాయో, ఫ్లోరిడా వంటి పెద్ద పెద్ద నగరాలు కూడా ఆ దేశంలో ఒప్పందాలు చేసుకున్నాయి. తీరా చూస్తే, అటువంటి దేశం లేదని తెలియడంతో అమెరికా ఒక్కసారిగా షాక్ అయింది. వెంటనే ఒప్పందాలు రద్దు చేసుకున్నట్లు ఆ నగరాలు ప్రకటించాయని ఫాక్స్‌న్యూస్ తెలియజేసింది. టెక్నాలజీని అభివృద్ధి చేసే దేశం నిత్యానందుడి మాయలో ఎలా పడిపోయిందో అర్థంగాని ప్రశ్న.