New Zealand PM Resignation: న్యూజిలాండ్ ప్రధాని పదవికి జసిండా రాజీనామా
New Zealand PM Resignation: న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెన్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆమె తన పదవికి వచ్చే నెలలో రాజీనామా చేయనున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించారు. ఈ ఏడాది న్యూజిలాండ్ సార్వత్రిక ఎన్నికలు జగరనున్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో అధికార లేబర్ పార్టీ మరోసారి విజయం సాధిస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు. ఈ ఏడాది అక్టోబర్ 14 వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ముందుగా ఆమె ఎందుకు రాజీనామా చేయనున్నారనే విషయాన్ని ప్రకటించలేదు. ప్రధాని పదవికి రాజీనామా చేసినా, ఎంపీగా కొనసాగుతానని మాత్రం పేర్కొన్నారు.
ప్రధానిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించానని, అందులో తనకు ఎలాంటి అసంతృప్తి లేదని అన్నారు. 2017లో న్యూజిలాండ్ పార్లమెంటుకు ఎన్నికలు జరగ్గా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఈ సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా జసిండా ప్రధాని పదవిని చేపట్టింది. 2020లో కరోనాను ఎదుర్కొనడంలో న్యూజిలాండ్ విజయం సాధించింది. ఆ దేశంలో అత్యంత తక్కువ కేసులు నమోదయ్యాయి. జసిండా తీసుకున్న సంచలనమైన, కఠినమైన నిర్ణయాలే ఆదేశాన్ని మహమ్మారి నుండి కాపాడగలిగాయి. అన్ని రంగాల్లో దేశాన్ని ఆమె ప్రగతిపధంలో నడిపించడంలో సఫలమయ్యారు. సంకీర్ణ ప్రభుత్వం నుండి ఎలాంటి ఒత్తిడి లేకున్నా ఆమె ఎందుకు రాజీనామా చేయాలనుకుంటున్నారనే విషయాన్ని పేర్కొనలేదు.