Nepal PM Twitter: హ్యాకింగ్‌కు గురైన నేపాల్ ప్రధాని ట్విట్టర్
Nepal PM Twitter: సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, ముఖ్యనేతల ట్విట్టర్ అకౌంట్లపై కన్నేశారు కేటుగాళ్లు . గత కొంతకాలంగా ప్రముఖ సంస్థలు, వ్యక్తుల ట్విట్టర్ అకౌంట్లు హ్యాక్‌కు గురవుతున్నాయి. తాజాగా నేడు తెల్లవారుజామున నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాక్‌కు గురైంది. దహల్ ప్రొఫైల్‌కు బదులుగా ప్రో ట్రేడర్ల కోసం నాన్-ఫంగబుల్ టోకెన్ మార్కెట్ ప్లేస్ అయిన బీఎల్‌యూఆర్ కనిపించింది. దీంతో హ్యాకింగ్ గురైదని నిర్ధారించారు.
హ్యాకర్లు ట్విట్టర్ ఖాతాలో ఒక ట్వీట్‌ను పిన్ చేశారు. ‘సమన్ చేయడం ప్రారంభమైంది. ‘మీ బ్యాక్ సర్వర్ పాస్ ను సిద్ధం చేసుకోండి అండ్ గెట్ డౌన్ ఇన్ ద పిట్’ అని రాసుకొచ్చారు. అయితే అకౌంట్‌ను వెంటనే పునరుద్ధరించారు ఐటీ అధికారులు. హ్యాకింగ్ విషయంపై ప్రధాని కార్యాలయం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ అకౌంట్‌కు 690.1కే ఫాలోవర్స్ ఉన్నారు. నేపాల్ ప్రధానిగా పుష్ప కమల్ గతేడాది డిసెంబర్‌లో మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.