అసలే అది చిన్నదేశం.. పైగా సైనిక పాలన... అడుగడుగునా అణిచివేతలు... అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న దేశం... ఏ చిన్న అడ్డంకి వచ్చినా జీవితాలు విలవిలలాడిపోయే దేశం... ఆర్థికంగా, ఆహార పరంగా సంక్షోభం ఎదుర్కొంటున్నది. ఈ దేశంపై ప్రకృతి మోచా రూపంలో కన్నెర్ర చేసింది. మే 6న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మోచా తుఫానుగా మారింది. అయితే, ఈ తుఫాను భారత్ బంగ్లాదేశ్ ప్రాంతంలో తీరం దాడుటుందని భావించారు.
Mocha Cyclone: అసలే అది చిన్నదేశం.. పైగా సైనిక పాలన… అడుగడుగునా అణిచివేతలు… అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న దేశం… ఏ చిన్న అడ్డంకి వచ్చినా జీవితాలు విలవిలలాడిపోయే దేశం… ఆర్థికంగా, ఆహార పరంగా సంక్షోభం ఎదుర్కొంటున్నది. ఈ దేశంపై ప్రకృతి మోచా రూపంలో కన్నెర్ర చేసింది. మే 6న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మోచా తుఫానుగా మారింది. అయితే, ఈ తుఫాను భారత్ బంగ్లాదేశ్ ప్రాంతంలో తీరం దాడుటుందని భావించారు. కానీ, ఇది అనూహ్యంగా దిశను మార్చుకొని మయన్మార్ వైపు మళ్లింది. ఆదివారం రోజున మయన్మార్ వద్ద తీరం దాటింది. తీరం దాటే సమయంలో మోచా భీభత్సం సృష్టింది. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. గంటకు 209 కిమీ వేగంతో పెనుగాలులు వీచాయి. దీంతో ఇళ్లు నేలమట్టమయ్యాయి… భారీ వృక్షాలు నేలకొరిగాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నది.
భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. వేలాది ఇళ్లు నేలమట్టం కావడం, లోతట్టు ప్రాంతాల్లోకి వదరనీరు చేరడంతో తీరప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నారు. సైనిక ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో సహాయక చర్యలు మమ్మురంగా కొనసాగుతున్నాయి. వందలాది మంది మరణించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఎంత మంది మరణించి ఉంటారన్నది ఇంకా అధికారికంగా దృవీకరణ కాలేదు. 700 మందికి పైగా గాయపడ్డారు. వరదప్రాంతాల్లో చిక్కుకున్నవారికి సైన్యం ఆహారాన్ని సరఫరా చేయడంపై దృష్టి సారించింది. ఇక మోచా ప్రభావంభారత్లోని మిజోరాంపై కూడా పడింది. మోచా ధాటికి 235 ఇళ్లు నేలమట్టమయ్యాయి. పెద్ద ఎత్తున ఈదురు గాలులు వీచడంతో మయన్మార్ బోర్డర్లోని 50 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు భారత్ అధికారులు.