Miss Universe 2022: అమెరికా అందగత్తెకు మిస్ యూనివర్స్ కిరీటం
Miss USA R Bonny Gabriel Crowned Miss Universe 2022
అమెరికా అందగత్తె బోన్నీ గాబ్రియెల్ ను మిస్ యూనివర్స్ కిరీటం వరించింది. 2022 మిస్ యూనివర్స్ హోదాను దక్కించుకుంది. అంగరంగ వైభవంగా జరిగిన పోటీల్లో ప్రత్యర్ధులపై పైచేయి సాధించి మిస్ యూనివర్స్ కిరీటం సొంతం చేసుకుంది.
లూసియానాలోని ఓర్లీన్స్ లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీలలో 80 దేశాలకు చెందిన ముద్దు గుమ్మలు పాల్గొన్నారు. భారతకాల మాన ప్రకారం జనవరి 15 ఉదయం 6.30కు మిస్ యూనివర్స్ చివరి దశ పోటీలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 9.30 గంటలకు మిస్ యూనివర్స్ ఎవరనేది తేలిపోయింది. అమెరికా అమ్మాయిని మిస్ యూనివర్స్ కిరీటం వరించింది.
మిస్ యూనివర్స్ హోదా దక్కితే నీవు ఏ విధంగా పనిచేస్తావు అనే ప్రశ్నకు గాబ్రియెల్ ఇచ్చిన సమాధానం జడ్జిలను మెప్పించింది.డిజైనింగ్ రంగంలో గత 13 ఏళ్లుగా పనిచేస్తున్నానని, ఆ రంగం ద్వారా తన సేవలను మరింతగా విస్తరిస్తానని తెలిపింది. రీ సైకిల్ అయిన మెటీరియల్ తో అనేక వస్త్రాలను తయారు చేస్తున్నానని, ఆ తయారీ విధానం అనేక మంది మహిళలకు, యువతులకు నేర్పిస్తానని గాబ్రియెల్ తెలిపింది.
మహిళల అక్రమ రవాణా ద్వారా బాధింప బడిన అనేక మందికి తనకు తెలిసిన డిజైనింగ్ విద్యను నేర్పుతానని, తద్వారా వారి జీవితాలలో మార్పును తెస్తానని గాబ్రియెల్ తెలిపింది. గృహహింసకు లోనైన మహిళలు ఎందరో ఉన్నారని, అటువంటి వారికి కూడా తనకు తెలిసిన డిజైనింగ్ విధానాలను నేర్పుతానని గాబ్రియెల్ తెలిపింది. సమాజానికి ఉపయోగపడే అంశాలపై ఖర్చు చేస్తానని, తద్వారా సమాజంలో కొంతైనా మార్పుకు శ్రీకారం చుడతానని గాబ్రియెల్ తెలిపింది. మనందరిలోను ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని, వాటిని ఇతరుల జీవితాలకు అందించడం ద్వారా వారిలో మార్పును తీసుకురావచ్చని గాబ్రియెల్ నమ్మకం వ్యక్తం చేసింది.
వెనిజులా, డొమినికన్ రిపబ్లిక్, అమెరికాకు చెందిన ముగ్గురు ముద్దుగుమ్మలు చివరి రౌండ్లోకి ప్రవేశించారు. చివరి రౌండ్లో అడిగిన ప్రశ్నకు వారిచ్చిన సమాధానం బట్టి మిస్ యూనివర్స్ ఎవరనేది నిర్ణయించారు.
The new Miss Universe is USA!!! #MISSUNIVERSE pic.twitter.com/7vryvLV92Y
— Miss Universe (@MissUniverse) January 15, 2023
….
THE NEW MISS UNIVERSE IS… MISS USA! 👑
FilAm R'Bonney Gabriel of USA bested all other delegates and was hailed as #MissUniverse2022! pic.twitter.com/lAYFKbo8Do
— The Philippine Star (@PhilippineStar) January 15, 2023
……..