Miss Universe: మిస్ యూనివర్స్ పోటీలు ఎలా జరుగుతున్నాయో తెలుసా?
Miss Universe contest 2023, Divita Rai representing India
మిస్ యూనివర్స్ పోటీలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 80 దేశాలకు చెందిన ముద్దు గుమ్మలు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ పోటీల్లో ఇప్పటికే అనేక రౌండ్లు పూర్తయ్యాయి. లూసియానాలోని ఓర్లీన్స్ లో జరుగుతున్న మిస్ యూనివర్స్ పోటీలలో భారత దేశం నుంచి దివితా రాయ్ పోటీకి దిగింది. భారతకాల మాన ప్రకారం ఆదివారం ఉదయం 6.30కు మిస్ యూనివర్స్ చివరి దశ పోటీలు జరగనున్నాయి. కొన్ని గంటల తర్వాత విజేత ఎవరనేది తేలనుంది.
మిస్ యూనివర్స్ పోటీలలో భారత దేశం నుంచి పోటీకి దిగిన కన్నడ కస్తూరి దివితా రాయ్ మంగళూర్ లో జన్మించింది. ముంబైలోని జేజే కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ విద్యాభ్యాసం పూర్తి చేసింది. ప్రస్తుతం దివితా రాయ్ వయస్సు 23 సంవత్సరాలు. ఆర్కిటెర్చర్ విద్యనభ్యసించిన దివితా మోడల్ గా మారింది. పలు క్రీడల్లోను ప్రవేశం పొందింది. బ్యాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్, పెయింటింగ్, మ్యూజిక్ రంగాల్లో ఎక్కువ ఆసక్తిని పెంచుకుంది.
దేశంలో అన్ని వర్గాల పిల్లలకు చదువు అందించాలనే సంకల్పం దివితా రాయ్ లో ప్రగాఢంగా ఉంది. అందుకోసం ఆమె కొన్ని ఎన్జీఓలతో కలిసి పనిచేస్తోంది. టీచ్ ఫర్ ఇండియా, CRY, నన్హీ కాలీ వంటి సంస్థల ద్వారా తన లక్ష్యాన్ని చేరుకునే విధంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటుంది.
హర్నాజ్ సంధు
2021 డిసెంబర్ లో భారతదేశానికే చెందిన హర్నాజ్ సంధు మిస్ యూనివర్స్ టైటిల్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న పోటీల్లో విజేతగా నిలిచిన వ్యక్తి హర్నాజ్ సంధు టైటిల్ అందించనుంది. 71వ మిస్ యూనివర్స్ పోటీల్లో అనేక ప్రత్యేకతలున్నాయి. ఈ పోటీలలో మొట్టమొదటి సారిగా అందరూ మహిళా ఎగ్జిక్యూటివ్ లే లీడ్ చేస్తున్నారు.
నేషనల్ కాస్ట్యూమ్స్ రౌండ్
మిస్ యూనివర్స్ పోటీల్లో భాగంగా జరిగిన నేషనల్ కాస్ట్యూమ్స్ రౌండ్ లో దివితా రాయ్ అదిరిపోయే కాస్ట్యూమ్స్ ధరించింది. సోనే కి చిడియా అనే టైటిల్ తో కాస్ట్యూమ్స్ రౌండ్ పూర్తి చేసుకుంది. ప్రఖ్యాత డిజైనర్ అభిషేక్ శర్మ దివితా ధరించిన సోనే కి చిడియా కాస్ట్యూమ్స్ రూపొందించారు.
భారత జీవిన విధానాన్నితలపించే విధంగా ఈ కాస్ట్యూమ్స్ రూపకల్పన జరిగినట్లు అభిషేక్ శర్మ తెలిపారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఛండేరీ జిల్లాలో లభించే ఫ్యాబ్రిక్ తో లెహంగాను తయారు చేసినట్లు అభిషేక్ తెలిపారు. నేషనల్ కాస్ట్యూమ్స్ విభాగంలో దివితా రాయ్ ధరించిన డ్రెస్ ఎందరి నుంచో ప్రశంసలు అందుకుంటోంది.సోనే కి చిడియా థీమ్ ను ఎంతో అద్భుతంగా ఆవిష్కరించారనే నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. దివితా రాయ్ ను అభినందిస్తున్నారు.
DIVITA RAI, INDIA 🇮🇳
LIVA Miss Diva Universe 2022, @divitarai2 at last night’s @MissUniverse Preliminary Competition 😍#DivitaRai #71stMissUniverse #MissUniverseIndia pic.twitter.com/59w63rrB2l
— Miss Diva (@MissDivaOrg) January 12, 2023
Miss Universe India Divita Rai brought India's 'Sone Ki Chidiya' to the Universe stage!#71stMissUniverse #MissUniverse2022 #MissIndia pic.twitter.com/xdX4vY8AhG
— Pratap (@valtairblues) January 13, 2023
Miss Universe India Divita Rai brought India's 'Sone Ki Chidiya' to the Universe stage!#MissUniverse #71stMissUniverse #MissUniverse2022 pic.twitter.com/l9mFEzQUCG
— Priyanka Hemanti Bhatt (@iPriyankaBhatt) January 12, 2023