మడగాస్కర్‌లోని ఓ స్టేడియంలో (Stadium) దారుణం జరిగింది. పెద్ద ఎత్తున ప్రేక్షకులు ఒక్కసారిగా బయటికి రావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 13 మంది ప్రేక్షకులు ప్రాణాలు కోల్పోయారు.
Madagascar: మడగాస్కర్‌లోని ఓ స్టేడియంలో (Stadium) దారుణం జరిగింది. పెద్ద ఎత్తున ప్రేక్షకులు ఒక్కసారిగా బయటికి రావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 13 మంది ప్రేక్షకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 80 మందికిపైగా గాయాల పాలయ్యారు.
అంటననారివోలోని ఓ స్టేడియంలో 11వ ఇండియన్ ఓసియన్ క్రీడలను నిర్వహించారు. ఈ పోటీలను చూసేందుకు దాదాపు 50 వేల మంది ప్రేక్షకులు స్టేడియానికి వెళ్లారు. ఒక్కసారిగా ఎంట్రీ వద్దకు పెద్ద ఎత్తున జనాలు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఒకరినొకరు తోసుకోవడంతో కొందరు కిందపడిపోయారు. ఈ ఘటనలో 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 90 మందికిపైగా ప్రక్షకులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అక్కడున్న సెక్యూరిటీ పక్కనే ఉన్న మరో గేట్‌ను ఓపెన్ చేసి ప్రేక్షకులను బయటికి పంపించారు.
ఆ తర్వాత గాయపడిన వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో కూడా కొందరి పరిస్థితి క్రిటికల్‌గా ఉందని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై మడగాస్కర్ అధ్యక్షుడు ఆండ్రీ రాజోలినా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు. అలాగే మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా స్టేడియం సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.