లిబియా దేశానికి చెందిన ఓ మహిళా మంత్రి అనూహ్యంగా తన పదవిని కోల్పోయారు. ఇజ్రాయెల్ (Israel) దేశానికి చెందిన ప్రతినిధితో సమావేశమయినందుకు.. లిబియా (Libya) ఆ మంత్రిని పదవి నుంచి తప్పించింది.
Libya: లిబియా దేశానికి చెందిన ఓ మహిళా మంత్రి అనూహ్యంగా తన పదవిని కోల్పోయారు. ఇజ్రాయెల్ (Israel) దేశానికి చెందిన ప్రతినిధితో సమావేశమయినందుకు.. లిబియా (Libya) ఆ మంత్రిని పదవి నుంచి తప్పించింది.
ఇటీవల లిబియా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి నజ్లా అల్ మంగోష్ (Najla El Mangoush) రోమ్ పర్యటనకు వెళ్లారు. అక్కడ ఇటలీ విదేశాంగ మంత్రి సమక్షంలో ఇజ్రాయెల్ మంత్రి ఎలి కొహఎన్‌తో నజ్లా అల్ మంగోష్ సమావేశమయ్యారు. ఆ తర్వాత ఈ సమావేశంపై ఇజ్రాయెల్ ఓ ప్రకటన చేసింది. వ్యవసాయం, నీటి నిర్వహణ, సాంకేతిక అంశాల్లో ఇజ్రాయెల్ సాయం వంటి అంశాలపై కీలకంగా చర్చలు జరిపినట్లు ప్రకటనలో పేర్కొంది.
ప్రస్తుతం ఇజ్రాయెల్ చేసిన ప్రకటన సంచనలంగా మారింది. ఎందుకంటే పలు అరబ్ దేశాల మాదిరిగానే లిబియా కూడా ఇజ్రాయెల్‌ను గుర్తించలేదు. అటువంటిది ఆ దేశ ప్రతినిధితో ఎలా సమావేశమవుతారని.. నజ్లా అల్ మంగోష్‌పై లిబియాలో వ్యతిరేకత ఎదురయింది. ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు కూడా చోటుచేసుకున్నాయి. కొందరు రోడ్లపైకి వచ్చి విధ్వంసం సృష్టించారు. కార్లు, టైర్లు అంటుపెట్టారు.
ఇక ఈ ఘటనపై లిబియా ప్రధాని అబ్దుల్ హమీద్ స్పందించారు. నజ్లా అల్ మంగోష్‌ను పదవి నుంచి తొలగించారు. అంతేకాకుండా దర్యాప్తుకు కూడా నజ్లాను ఆదేశించారు. ఇక నజ్లా శాఖను మరో ప్రతినిధికి అప్పగించారు.