KTR: పెట్టుబడులే లక్ష్యంగా వరుసగా విదేశీ టూర్లకు వెళ్తున్నారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (Minister ktr). మొన్నటి వరకు యూకేలో (UK) పర్యటించిన కేటీఆర్.. ఇప్పుడు అమెరికాలో (America) పర్యటిస్తున్నారు.
KTR: పెట్టుబడులే లక్ష్యంగా వరుసగా విదేశీ టూర్లకు వెళ్తున్నారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (Minister ktr). మొన్నటి వరకు యూకేలో (UK) పర్యటించిన కేటీఆర్.. ఇప్పుడు అమెరికాలో (America) పర్యటిస్తున్నారు. దిగ్గజ కంపెనీల సీఈవోలతో సమావేశమవుతూ.. తెలంగాణకు (Telangana) పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. కేటీఆర్‌తో సమావేశం అనంతరం పలు దిగ్గజం కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి.
ఇక బుధవారం ఐక్యరాజ్య సమితి మాజీ అంబాసిడర్, భారత సంతతికి చెందిన నిక్కీ హేలీతో (Nikki Haley) కేటీఆర్ సమావేశమయ్యారు. వివిధ వ్యూహాత్మక అంశాలపై ఇరువురు చర్చించారు. తెలంగాణ ప్రాముఖ్యతను, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు అనువుగా ఉన్న అంశాలను కేటీఆర్, నిక్కీ హేలీకి వివరించారు. అలాగే ఆమెతో దిగిన ఫొటోలను కేటీఆర్ ట్విట్టర్లో షేర్ చేశారు. రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ వంటి అంశాలపై విస్తృత స్థాయిలో నిక్కీ హేలీతో చర్చించినట్లు కేటీఆర్ పేర్కొన్నారు.
ఇకపోతే త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను కూడా పోటీ చేయనున్నట్లు నిక్కీ హేలీ ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికా ఆర్థిక పునరుద్ధరణ మార్గాల అన్వేషణకు , దేశ గౌరవం, లక్ష్యాలను బలోపేతం చేసేందుకు కొత్త తరం నాయకత్వానికి ఇదే సరైన సమయం అని నిక్కీ హేలీ అన్నారు. దేశాన్ని సరికొత్త దిశలో తీసుకెళ్లగలిగే నాయకురాలిని తానే అని భావిస్తున్నట్లు వెల్లడించారు.
It was an absolute pleasure interacting with @NikkiHaley Former UN Ambassador & Governor of South Carolina
Briefed her on the strategic importance of Hyderabad & Telangana in the larger context of US – India relations
Also discussed economy, elections and exchanged views on… pic.twitter.com/PDyxnbwu3b
— KTR (@KTRBRS) May 23, 2023