Haesoo: పాపులర్ కొరియన్ పాప్ సింగర్ హేసూ (Haesoo) కన్నుమూశారు. 29 ఏళ్ల వయస్సులో తుదిశ్వాస విడిచారు. ఆమె మరణించిన రెండు రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ధృవీకరించిన తర్వాతే బయటకి తెలియజేశారు. అయితే ముందుగా హేసూ తన ఇంటిలోనే మరణించిందని ప్రకటించిన పోలీసులు.. ఆ తర్వాత ఓ హోటల్ రూమ్‌లో చనిపోయిందని ప్రకటించారు.
Haesoo: పాపులర్ కొరియన్ పాప్ సింగర్ హేసూ (Haesoo) కన్నుమూశారు. 29 ఏళ్ల వయస్సులో తుదిశ్వాస విడిచారు. ఆమె మరణించిన రెండు రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ధృవీకరించిన తర్వాతే బయటకి తెలియజేశారు. అయితే ముందుగా హేసూ తన ఇంటిలోనే మరణించిందని ప్రకటించిన పోలీసులు.. ఆ తర్వాత ఓ హోటల్ రూమ్‌లో చనిపోయిందని ప్రకటించారు. దీంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. అటు కొరియన్ మీడియా కూడా హేసూ మరణం సహజమైనది కాదంటూ కథనాలను ప్రకటిస్తోంది. సూసైడ్ నోట్ కూడా లభించిందని పలు కథనాలు పేర్కొన్నాయి. ఈ వార్తలపై కొరియన్ పోలీసులు ఇప్పటి వరకు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు.
మరోవైపు హేసూ మరణంతో ప్రపంచవ్యాప్తంగా ఆమె అభిమానులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. సోషల్ మీడియా (Social media) వేదికగా సంతాపం ప్రకటిస్తూ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. ఇక 1993లో హేసూ జన్మించారు. చిన్నతనంలోనే కొరియన్ సంగీతంలో ప్రావీణ్యం సంపాదించారు. స్టడీస్ కంప్లీట్ అయ్యాక.. 2019లో సింగర్‌గా పరిచయం అయ్యారు హేసూ. కొరియన్ టెలివిజన్ షో ది ట్రోట్ (The Trot) హేసూకు మంచి గుర్తింపు తీసుకొచ్చి పెట్టింది. ఈ షోతో హేసూ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. తనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చి పెట్టిన ట్రోట్ షో పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు హేసూ. ఆ తర్వాత మై లైఫ్ ఐ విల్ (My Life I Will) అంటూ తన సొంత సింగిల్ ఆల్బమ్‌ని కూడా హేసూ రిలీజ్ చేశారు.